KGF లో రాకీ భాయ్ పాత్రను మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

August 22, 2022 10:42 AM

KGF : యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియ‌ఫ్‌ సినిమా ఏంటో.. దాని స్టామీనా ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అంతేకాదు నార్త్‌లో హిందీ సినిమాల రికార్డులను తిరగరాసింది. బాలీవుడ్‌లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఒక్క సినిమాతో కన్నడ నటుడు యశ్ కెరీర్ పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. యశ్ మూడేళ్ల కింది వరకు కేవలం కన్నడలోనే స్టార్ హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోగా ఎదిగాడు. ఇక కెజియ‌ఫ్‌తో రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన యశ్.. ఇటీవల కెజియఫ్ 2 మూవీతో పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో టాక్ తెచ్చుకుంది.

ఈ మూవీలో హీరోగా నటించిన యష్ కి ఎంత పెద్ద గుర్తింపు వచ్చిందో అందరికీ తెలుసు. హీరో పాత్రలో యష్ కాకుండా మరెవరైనా చేస్తే ఎలా ఉంటుందో అని ఊహించుకోవడం కూడా కష్టమే. కానీ ఈ సినిమాలో మొదట వేరే స్టార్ హీరోని అనుకున్నారట. ప్రశాంత్ నీల్ ఈ కథ అనుకున్నప్పుడు ఇందులో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తే బాగుంటుంది అనుకొని హృతిక్ రోషన్ ని కలవడానికి చాలా ప్రయత్నించారట. కానీ హృతిక్ రోషన్ అపాయింట్‌మెంట్‌ కూడా దొరకలేదు.

do you know who rejected KGF movie first
KGF

దీంతో కన్నడ సినిమా ఇండస్ట్రీ ఎంత గొప్పదో పాన్ ఇండియన్ లెవెల్ లో చెప్పాల‌ని నిర్ణయించుకున్నారు ప్రశాంత్ నీల్. అందుకే కన్నడ హీరోతోనే ఎలాగైనా సరే ఈ సినిమా చేద్దామని అనుకున్నారు. ప్రశాంత్ నీల్ అనుకున్నట్టే యష్ తో ఈ సినిమా చేశారు. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా తర్వాత యష్ కూడా బాగా పాపులర్ అయ్యాడు. బాలీవుడ్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ మూవీతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అనుకున్నట్టు శాండల్ వుడ్ పేరు బాలీవుడ్ కే కాదు హాలీవుడ్ కి కూడా పరిచయం చేసి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.

KGF

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now