Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ వస్తుందంటే చాలు ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. మూవీ ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచి రిలీజ్ అయ్యే వరకు ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు. అలా కొంత గ్యాప్ తరువాత భీమ్లా నాయక్ అంటూ పవన్ నుంచి మరో మాస్ మూవీ రావడంతో బాక్సాఫీస్ షేక్ అయింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా రానా ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. అంతే కాకుండా ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించడంతోపాటు మాటలు కూడా రాశారు. ఈ సినిమాను మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియంకు రీమేక్ గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
అయితే భీమ్లా నాయక్ కథ మొదట టాలీవుడ్ లో పలువురు టాప్ హీరోల వద్దకు వెళ్లి చివరకు పవన్ కల్యాణ్ వద్దకు చేరిందట. ఈ కథ పవన్ కల్యాణ్ కు బాగా సూట్ అవుతుందని త్రివిక్రమ్ ఒప్పించారట. ఇక ఈ సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ కథ బాలకృష్ణ వద్దకు వెళ్లిందట. కానీ బాలయ్య ఈ సినిమా కథ తనకు సూట్ అవ్వదని నో చెప్పారట. ఆయన రీమేక్‌లు కూడా చేయరు. కనుక ఈ కథను రిజెక్ట్ చేశారు. ఇక వరుసగా రీమేక్ లు చేస్తూ హిట్స్ అందుకుంటున్న విక్టరీ వెంకటేష్ వద్దకు కూడా ఈ సినిమా కథ వెళ్లిందట. కానీ వెంకటేష్ కూడా ఈ సినిమాను చేసేందుకు ఒప్పుకోలేదట. దీంతో మాస్ మహారాజ్ రవితేజ వద్దకు కూడా ఈ సినిమా స్టోరీ వెళ్లడంతో బిజీ షెడ్యూల్ వల్ల రవితేజ కూడా ఈ సినిమాకు నో చెప్పారు.
దీంతో చివరగా భీమ్లా నాయక్ కథ నచ్చడంతో త్రివిక్రమ్.. పవన్ కల్యాణ్ ను మీట్ అయ్యారు. కథ నచ్చడంతో పవన్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. విడుదలైన మూడు రోజులకే ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరి పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయింది. ప్రస్తుతం పవన్ క్రిష్ డైరెక్షన్ లో హరి హర వీరమల్లు, అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తున్నారు.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…