Dil Raju Wife Tejaswini : దిల్ రాజు రెండో భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?

Dil Raju Wife Tejaswini : తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప‌రిచ‌యం అవ‌స‌రం లేని నిర్మాత‌ల్లో దిల్ రాజు ఒక‌రు. శ్రీ వెంక‌టేశ్వర‌ క్రియేష‌న్స్ పై ఈయ‌న నిర్మించే చిత్రాలు కుటుంబ‌ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. చిన్న నిర్మాత స్థాయి నుండి భారీ బ‌డ్టెట్ సినిమాల‌ను నిర్మించే స్థాయికి దిల్ రాజు ఎదిగారని చెప్ప‌వ‌చ్చు. సినిమాను విడుద‌ల చేయ‌డానికి ముందే దాని విజ‌యాన్ని, అప‌జ‌యాన్ని అంచ‌నా వేసే వ్య‌క్తి దిల్ రాజు. ఇక తాజాగా ఈయ‌న రెండో సారి తండ్రి అయ్యారు. త‌న‌కు కొడుకు పుట్టాడు. దీంతో ఆయ‌న ప‌డుతున్న సంతోషాన్ని మాటల్లో వర్ణించ‌లేం.

అయితే త‌న మొద‌టి భార్య అనిత చ‌నిపోయిన త‌రువాత దిల్ రాజు మ‌రో పెళ్లి చేసుకున్నారు. కానీ దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోవ‌డానికి మొద‌ట అంగీక‌రించ లేద‌ట‌. తండ్రి మాన‌సిక క్షోభ‌కు గురి కావ‌డాన్ని చూడ‌లేని దిల్ రాజు కూతురు హ‌ర్షిత రెడ్డి తండ్రి రెండో పెళ్లి చేసుకోవ‌డానికి అంగీక‌రించేలా చేసింది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని న‌ర్సింగ్ ప‌ల్లి వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో 2020 మే 10న‌ దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నారు. లాక్ డౌన్ కార‌ణంగా ఈ పెళ్లికి చిత్ర ప‌రిశ్ర‌మ నుండి కానీ, స్నేహితుల‌ను కానీ ఎవ‌రినీ ఆహ్వానించ‌లేదు. కేవ‌లం ఇరుకుంటుబాల స‌న్నిహితుల మ‌ధ్య‌నే ఈ వివాహం జ‌రిగింది.

Dil Raju Wife Tejaswini

అయితే దిల్ రాజు రెండో భార్య తేజ‌స్విని గురించి ఎవ‌రికీ ఏ విష‌యాలు ఇప్ప‌టి వ‌ర‌కు తెలియ‌దు. తాజాగా ఆమె ఒక బ్రాహ్మ‌ణ కుంటుంబానికి చెందిన అమ్మాయ‌ని టాక్ న‌డుస్తోంది. అయితే ఆమె ఒక ప్ర‌ముఖ విమాన‌యాన సంస్థ‌లో ఎయిర్ హోస్టెస్‌గా ప‌నిచేసింద‌ట‌. ఆమెను తొలిసారి ఫ్లైట్‌లో చూసి దిల్ రాజు ఇష్ట‌ప‌డ్డార‌ట. ఈ క్ర‌మంలోనే ఆమెను పెళ్లి చేసుకుంటాన‌ని అడిగితే అందుకు ఆమె ఓకే చెప్పింద‌ట‌. ఇక ఆమెది కూడా నిజామాబాద్ జిల్లానే అని తెలిసింది.

తేజ‌స్వినిది నిజామాబాద్ కాగా.. దిల్ రాజుది కూడా అదే జిల్లా కావ‌డం విశేషం. ఆమె పెళ్లి అయ్యే వ‌ర‌కు ఎయిర్ హోస్టెస్‌గానే ప‌నిచేసింది. వ‌య‌స్సు 34 ఏళ్లు. ఆమె అస‌లు పేరు తేజ‌స్విని కాగా.. ఆమె కులం, మ‌తం, ఇత‌ర వివ‌రాలు తెలియకుండా ఉండేందుకు గాను ఆమె పేరును వైగా రెడ్డిగా మార్చారు. అయితే ఇంతకు మించి తేజ‌స్విని గురించి వివ‌రాలు ఏవీ తెలియ‌వు. ఏం తెలిసినా సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తార‌న్న ఉద్దేశంతోనే దిల్ రాజు ఆమె ప‌ట్ల ఇన్ని జాగ్ర‌త్త‌ల‌ను తీసుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఆమె గురించి ఎవ‌రికీ ఏమీ తెలియ‌కుండా గోప్యంగా ఉంచుతున్నార‌ని స‌మాచారం.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే దిల్ రాజు నిర్మించిన ఎఫ్3 మూవీ ఈ మ‌ధ్యే విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌ను నిర్మిస్తున్నారు. ముఖ్యంగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ హీరోగా దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ అతి త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీంతోపాటు ప‌లు ఇత‌ర సినిమాల‌ను కూడా దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM