Acharya Movie : చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ఆచార్య. ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. కొద్ది రోజులుగా చిరంజీవి, రామ్ చరణ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ మూవీపై ఆసక్తిని పెంచుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికర విషయాలు కొన్ని బయటకు వచ్చాయి. అక్టోబరు 8, 2019 విజయదశమి రోజు చిరు 152 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా మొదలైంది. కరోనాతోపాటు ఇతర కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్‌కి రెండు సంవత్సరాల ఆరు నెలల సమయం పట్టింది.
చిరు-నాగబాబుల తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు నటులు కలిసి చేస్తున్న సినిమా ఇదే కావటం విశేషం. గతంలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఖైదీ నెంబర్ 150, బ్రూస్లీ, మగధీర చిత్రాలు చేశారు. కానీ అవి పూర్తి స్థాయి నిడివి ఉన్న చిత్రాలు కాదు. ఆచార్యలో రామ్ చరణ్, చిరంజీవిత పాత్రల నిడివి ఎక్కువగానే ఉంటుంది. ఇక ఆచార్య టైటిల్‌ని చిరంజీవి స్వయంగా లీక్ చేయడం విశేషం. స్టాలిన్ చిత్రం తర్వాత మణిశర్మతో సినిమాని చేస్తున్నారు చిరంజీవి. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషని అనుకున్నారు. ఆ తర్వాత ఆమె తప్పుకోవడంతో కాజల్ ని తీసుకున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్ వేయగా, ఎక్కువ శాతం షూటింగ్ ధర్మస్థలి ప్రాంతంలో జరిగింది. కోకాపేటలోని చిరంజీవికి చెందిన 20 ఎకరాల స్థలంలో నాలుగు నెలల పాటు శ్రమించి ధర్మస్థలి సెట్ వేశారు.
గతంలో పవన్ నటించిన జల్సా సినిమాకి వాయిస్ అందించిన మహేష్ ఇప్పుడు చిరు ఆచార్యకు కూడా అందించడం విశేషం. రెండు సినిమాల్లో మెగా బ్రదర్స్ నక్సలైట్ పాత్రల్లోనే కనిపించారు. ఈ సినిమా రన్ టైం 154 నిమిషాలు. రూ.140 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. అనేక సార్లు వాయిదా పడ్డ ఈ చిత్రాన్ని ముందుగా మే 13, 2021వ తేదీన రిలీజ్ చేయాలని అనుకున్నారు, కానీ కరోనా వల్ల వాయిదా పడింది. ఆ తర్వాత సంక్రాంతికి అనుకోగా మళ్ళీ కరోనా వల్ల వాయిదా పడింది. మళ్లీ ఫిబ్రవరి 4 లేదా ఏప్రిల్ 1, 2022న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ చివరకు ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా ఉన్నారు. సినిమాను ఎప్పుడెప్పుడు వీక్షిద్దామా.. అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్‌ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…