Acharya Movie : ఆచార్య సినిమాకు చెందిన ఈ ఆస‌క్తిక‌రమైన‌ విష‌యాలు.. మీకు తెలుసా?

April 28, 2022 8:56 AM

Acharya Movie : చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కొర‌టాల శివ తెర‌కెక్కించిన చిత్రం ఆచార్య‌. ఈ సినిమా ఏప్రిల్ 29న విడుద‌ల కానున్న నేప‌థ్యంలో ఈ చిత్రానికి సంబంధించి అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. కొద్ది రోజులుగా చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ వ‌రుస ఇంట‌ర్వ్యూలు ఇస్తూ మూవీపై ఆస‌క్తిని పెంచుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాలు కొన్ని బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అక్టోబరు 8, 2019 విజయదశమి రోజు చిరు 152 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా మొదలైంది. క‌రోనాతోపాటు ఇతర కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా రిలీజ్‌కి రెండు సంవత్సరాల ఆరు నెలల సమయం పట్టింది.

do you know these interesting things about Acharya Movie
Acharya Movie

చిరు-నాగబాబుల తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు నటులు కలిసి చేస్తున్న సినిమా ఇదే కావటం విశేషం. గ‌తంలో చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి ఖైదీ నెంబ‌ర్ 150, బ్రూస్లీ, మ‌గ‌ధీర చిత్రాలు చేశారు. కానీ అవి పూర్తి స్థాయి నిడివి ఉన్న చిత్రాలు కాదు. ఆచార్య‌లో రామ్ చ‌ర‌ణ్‌, చిరంజీవిత పాత్ర‌ల నిడివి ఎక్కువ‌గానే ఉంటుంది. ఇక ఆచార్య టైటిల్‌ని చిరంజీవి స్వ‌యంగా లీక్‌ చేయ‌డం విశేషం. స్టాలిన్ చిత్రం తర్వాత మణిశర్మతో సినిమాని చేస్తున్నారు చిరంజీవి. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషని అనుకున్నారు. ఆ తర్వాత ఆమె తప్పుకోవడంతో కాజల్ ని తీసుకున్నారు. ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా సెట్ వేయ‌గా, ఎక్కువ శాతం షూటింగ్ ధర్మస్థలి ప్రాంతంలో జరిగింది. కోకాపేటలోని చిరంజీవికి చెందిన 20 ఎకరాల స్థలంలో నాలుగు నెలల పాటు శ్రమించి ధర్మస్థలి సెట్‌ వేశారు.

గ‌తంలో ప‌వ‌న్ న‌టించిన జ‌ల్సా సినిమాకి వాయిస్ అందించిన మ‌హేష్ ఇప్పుడు చిరు ఆచార్య‌కు కూడా అందించ‌డం విశేషం. రెండు సినిమాల్లో మెగా బ్రదర్స్ నక్సలైట్‌ పాత్రల్లోనే కనిపించారు. ఈ సినిమా రన్ టైం 154 నిమిషాలు. రూ.140 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. అనేక సార్లు వాయిదా ప‌డ్డ ఈ చిత్రాన్ని ముందుగా మే 13, 2021వ తేదీన‌ రిలీజ్ చేయాలని అనుకున్నారు, కానీ కరోనా వల్ల వాయిదా పడింది. ఆ తర్వాత సంక్రాంతికి అనుకోగా మళ్ళీ కరోనా వల్ల వాయిదా పడింది. మళ్లీ ఫిబ్రవరి 4 లేదా ఏప్రిల్ 1, 2022న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ చివరకు ఏప్రిల్‌ 29న రిలీజ్ చేస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా ఉన్నారు. సినిమాను ఎప్పుడెప్పుడు వీక్షిద్దామా.. అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now