Bahubali 2 : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం బాహుబలి. ఈ సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కిన బాహుబలి 2 చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఇంటా బయటా ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి 2 సినిమా ఎక్కువగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న పాయింట్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ క్రమంలోనే బాహుబలి 2 ఉత్తరాదిలో రూ.510 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా దరిదాపుల్లో ఇటీవల విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రాలు ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 లేకపోవడం విశేషం.
ఉత్తర భారతదేశంలో కేజీఫ్ 2 రూ.250 కోట్లు, ఆర్ఆర్ఆర్ రూ.321 కోట్లు రాబట్టాయి. అదే భాహుబలి2 విషయానికి వస్తే రూ.510 కోట్ల వసూళ్ళని రాబట్టింది. ఇక స్ట్రెయిట్ హిందీ చిత్రాల విషయానికి వస్తే భజరంగీ భాయిజాన్ రూ.320 కోట్లు, దంగల్ రూ.310 కోట్లు వసూలు చేశాయి. ఈ లెక్కలు చూస్తుంటే బాహుబలి 2కి ఉత్తరాదిలో ఎలాంటి ఆదరణ లభించిందో కూడా ఇది చూపిస్తుంది. బాక్సాఫీస్ గణాంకాల విషయానికొస్తే, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ ఇప్పటి వరకు రూ. 250 కోట్లు, రూ. 321 కోట్లను నికరంగా వసూలు చేశాయి. బాహుబలి 2 సంచలనాత్మకంగా రూ.510 కోట్లు నెట్ వసూలు చేసింది.
కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కేజీఎఫ్ 2 చిత్రాన్ని కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా తీసుకొచ్చింది చిత్ర యూనిట్. అయితే కేజీఎఫ్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ మాస్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మాస్ చిత్రాలను ఇష్టపడే నార్త్ ఆడియెన్స్‌కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. అలాగే కేజీఎఫ్ 2 కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఆర్ఆర్ఆర్ కూడా పలు రికార్డులని చెరిపేసింది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…