Vignesh : వాట్‌.. విగ్నేష్ క‌న్నా న‌య‌న‌తార‌నే పెద్ద‌నా.. ఇద్ద‌రి వ‌య‌స్సు ఎంతేమిటీ..?

June 10, 2022 12:21 PM

Vignesh : కోలీవుడ్ క్రేజీ ల‌వ్ బ‌ర్డ్స్‌గా ఉన్న విగ్నేష్‌, న‌య‌న‌తార‌ల వివాహం కుటుంబ స‌భ్యులు, బంధువులు, స్నేహితులు, సెల‌బ్రిటీల మ‌ధ్య గురువారం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. వీరి వివాహ వేడుక‌కు అనేక మంది సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారు. బాలీవుడ్ న‌టుడు షారూఖ్ ఖాన్‌తోపాటు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ, ప‌లువురు త‌మిళ సినీ ద‌ర్శ‌కులు, న‌టులు వీరి పెళ్లికి హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. వీరు 7 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే ఎట్ట‌కేల‌కు పెళ్లి బంధంతో వీరు ఒక్క‌ట‌య్యారు. ఇక వీరికి అభిమానులు భారీ ఎత్తున శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

ఇక సాధార‌ణంగా వ‌ధువు వ‌య‌స్సు త‌క్కువ‌గా.. వ‌రుడి వ‌యస్సు ఎక్కువ‌గా ఉండేలా చూసి వివాహం చేసుకుంటుంటారు. కానీ కొంద‌రి విష‌యంలో ఇందుకు భిన్నంగా ఉంటుంది. గ‌తంలోనూ ప‌లువురు సెల‌బ్రిటీల్లో వ‌రుడి వ‌య‌స్సు త‌క్కువ‌గా.. వ‌ధువు వ‌య‌స్సు ఎక్కువ‌గా ఉన్న‌వారు వివాహం చేసుకున్నారు. ఇక ఇప్పుడు కూడా అలాగే జ‌రిగింది. విగ్నేష్ క‌న్నా న‌య‌న‌తార‌నే వ‌య‌స్సులో పెద్ద‌ది కావ‌డం విశేషం. వీరిద్ద‌రికీ దాదాపుగా ఒక ఏడాది ఏజ్ గ్యాప్ ఉంది. అంటే నయ‌న‌తార క‌న్నా విగ్నేష్ వ‌య‌స్సులో ఒక ఏడాది చిన్న‌వాడ‌న్న‌మాట‌.

do you know the age gap between Vignesh and Nayanthara
Vignesh

న‌య‌నతార 1984 న‌వంబ‌ర్ 18న జన్మించ‌గా.. మ‌రుస‌టి ఏడాది.. అంటే.. 1985 సెప్టెంబ‌ర్ 18వ తేదీన విగ్నేష్ జ‌న్మించారు. ఈ క్ర‌మంలోనే దాదాపుగా ఇద్ద‌రికీ 10 నెల‌ల ఏజ్ గ్యాప్ ఉంది. న‌య‌న‌తార క‌న్నా విగ్నేష్ 10 నెల‌లు వ‌య‌స్సులో చిన్నవాడు అన్న‌మాట‌. అయితే ఇంత‌కన్నా ఎక్కువ ఏజ్ గ్యాప్‌తోనే చాలా మంది పెళ్లిళ్లు చేసుకుని అన్యోన్యంగా ఉంటున్నారు. క‌నుక ఇంత త‌క్కువ ఏజ్ గ్యాప్ అస‌లు మ్యాట‌రే కాద‌ని చెప్ప‌వ‌చ్చు.

కాగా 2015లో విగ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నానున్ రౌడీదాన్ అనే మూవీ వ‌చ్చింది. దీంట్లో విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార న‌టించారు. ఈ చిత్రం షూటింగ్ స‌మ‌యంలోనే విగ్నేష్‌, న‌య‌న‌తార ప్రేమ‌లో ప‌డ్డారు. త‌రువాత ఇప్పుడు వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment