Bahubali : బాహుబ‌లి రెండు సినిమాల షూటింగ్ స‌మ‌యంలో ప్ర‌భాస్ ఎంత బ‌రువు ఉన్నాడో తెలుసా ?

April 30, 2022 11:36 AM

Bahubali : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి సినిమా రెండు పార్ట్‌లు ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించాయో అంద‌రికీ తెలిసిందే. బాహుబ‌లి మొద‌టి పార్ట్ క‌న్నా రెండో పార్ట్‌నే చాలా మంది చూశారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. ఆల్ టైం అత్య‌ధిక క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేసిన మూవీగా రికార్డుల‌ను సృష్టించింది. ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన ఆర్ఆర్ఆర్‌, కేజీఎఫ్ 2 చిత్రాలే కాకుండా.. ఇత‌ర ఏ మూవీ కూడా బాహుబ‌లి 2 ద‌గ్గ‌ర దాకా రాలేకపోయాయి. అంత‌టి ఘ‌న విజ‌యాన్ని ఈ చిత్రం సొంతం చేసుకుంది.

do you know how much weight Prabhas has in Bahubali movies filming
Bahubali

అయితే బాహుబ‌లి రెండు పార్ట్‌ల‌లోనూ ప్ర‌భాస్ మ‌న‌కు ఒకసారి లావుగా.. మ‌రొక‌సారి స‌న్న‌గా క‌నిపిస్తాడు. తండ్రి పాత్ర అయితే లావుగా.. కొడుకు పాత్ర అయితే మన‌కు ప్ర‌భాస్ స‌న్న‌గా క‌నిపిస్తాడు. ఇక మొద‌టి పార్ట్ షూటింగ్ స‌మ‌యంలో ప్ర‌భాస్ 115 నుంచి 120 కిలోల వ‌ర‌కు బ‌రువు ఉండ‌గా.. రెండో పార్ట్ షూటింగ్‌కు కాస్త బ‌రువు పెరిగాడు. ఆ స‌మ‌యంలో ప్ర‌భాస్ 140 నుంచి 150 కిలోల వ‌ర‌కు బ‌రువు పెరిగాడు. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌లో.. తండ్రి పాత్ర‌కే ఆయ‌న బ‌రువు ఎక్కువ‌గా క‌నిపించ‌గా.. కొడుకు పాత్ర‌లో బ‌రువు త‌క్కువ‌గానే క‌నిపించారు.

ఇక బాహుబ‌లి మూవీ అనంత‌రం ప్ర‌భాస్ చేసిన రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ పరిచాయి. సాహో, రాధే శ్యామ్ ఘోర ప‌రాజ‌యాన్ని మూట గ‌ట్టుకున్నాయి. దీంతో ప్ర‌భాస్ మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ అనంత‌రం రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ఆచార్య మూవీ సైతం ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకుంటుండ‌డంతో.. రాజ‌మౌళి గండం రిపీట్ అయింద‌ని అంటున్నారు. అయితే మ‌రోవైపు ఎన్‌టీఆర్ కూడా త‌న త‌దుప‌రి సినిమాను చేయ‌బోతున్నాడు. మరి ఆయ‌న అయినా ఈ గండం నుంచి బ‌య‌ట ప‌డ‌తారా.. లేదా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now