Sr NTR : తెలుగువారి గొప్పదనాన్ని అంతర్జాతీయంగా రెప రెపలాడించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. నటుడిగా తెలుగు ప్రేక్షకుడి గుండెల్లో.. నాయకుడిగా తెలుగు వారి హృదయాల్లో ఆయన వేసిన ముద్ర శాశ్వతం. 295 చిత్రాల్లో ఆయన పోషించని పాత్రంటూ లేదు. ప్రతి పాత్రకు తన నటనతో ప్రాణం పోసిన నట దిగ్గజం ఎన్టీఆర్. ముఖ్యంగా ఎన్టీఆర్ ఏ పాత్ర వేసినా అటు నిర్మాత ఇటు డైరెక్టర్ ఇద్దరు సంతృప్తి చెందేవారు. ఒకటికి మించి ఎక్కువ టేక్ లు తీసుకుంటే ఆయన అవమానంగా ఫీల్ అయ్యే వారంట.
అంతే కాదు ఇలా చేస్తే నిర్మాతకు ఎంతో నష్టం వస్తుంది సమయం వృథా అవుతుందనీ తన తోటివారితో చెప్పేవారట. పౌరాణిక పాత్రలు నటించాల్సి వచ్చినప్పుడు సాధారణంగా ఒకటికి రెండుసార్లు తీసుకుంటారు. ఆ గెటప్ వేరుగా ఉంటుంది పదాల ఉచ్ఛరణ డబ్బింగ్ కు అనుగుణంగా ఉండాలి. పౌరాణికమైన, సాంఘికమైన ఏదైనా ఒకే ఒక్క టేకుతో చాలా అద్భుతంగా చేసేవారు ఎన్టీఆర్. ఆయనే ఆయా వేషాలు కూడా స్వయంగా వేసుకునే వారట. మేకప్ మ్యాన్ వచ్చి మనల్ని కూర్చోబెట్టి వేషం వేయాలంటే టైం వేస్ట్ తమ్ముడు.. అని ఆయనే మేకప్ వేసుకునే వారట.
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్టీఆర్ ఒక వేషం చేయాల్సి వచ్చినప్పుడు ఏకంగా 6, 7 టేకులు తీసుకున్నారట. గుమ్మడి రాసుకున్న పుస్తకంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. నర్తనశాల సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడిగా, అర్జునుడుగా నటించారు. ఈ 2 వేషాలు వేయాల్సి వచ్చినప్పుడు ఆయన ఇబ్బంది పడలేదు. కానీ బృహన్నలగా ఆయన వేషం వేసినప్పుడు పూర్తిగా నడక ఆహార్యం మారిపోతాయి. దీనిని సూట్ చేయాల్సిన సమయంలో మాత్రం అన్నగారు ఒకటికి రెండు సార్లు చెక్ తీసుకుని జాగ్రత్తగా చేశారని గుమ్మడి పేర్కొన్నారు. అన్నగారి జాగ్రత్తలే ఆ పాత్రకు జీవం పోశాయి అని ఆయన రాసుకొచ్చారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…