Rashmi Gautam : రాజ్ విరాఠ్ దర్శకత్వంలో నందు, రష్మీ గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. కుటుంబ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం గత రెండేళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. అసలు ఈ సినిమా ఉందనే విషయాన్ని కూడా చాలామంది ప్రేక్షకులు మరచిపోయారు. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత ఈ సినిమాను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు మూవీ మేకర్స్. నవంబర్ 4న బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రం విడుదల కాబోతుంది.
హీరో నందు ఈ సినిమా మాసి లుక్ లో కనిపించబోతున్నాడు. ఎప్పటినుంచో హీరో గా సరైన సక్సెస్ లేని నందు ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ మూవీలో రష్మీ గౌతమ్ కూడా రగ్డ్ లుక్‌లో కనిపించడం, పాటలు, మాటలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇదివరకే విడుదల చేసిన టీజర్, పాటలు అన్నీ కూడా బాగా వైరల్ అయ్యాయి.
కానీ ఇప్పుడు ఈ సినిమాపై తాజాగా నందు, రష్మీ గొడవ పడటం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అసలు వివరాల్లోకి వెళితే సినిమా ప్రేక్షకులలోకి తీసుకువెళ్లడానికి ప్రమోషన్స్ కోసం మూవీ మేకర్స్ అన్నీ సిద్ధం చేసుకున్నారట. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఎత్తగం లేదని, సినిమా ప్రమోషన్స్‌కి రావట్లేదంటూ యాంకర్ రష్మీగౌతమ్‌పై హీరో నందు ఫైర్ అయ్యాడు. అంతేకాకుండా యాంకర్ రష్మీ షూటింగ్ చేస్తున్న స్థలానికి వెళ్లి నానా హంగామా చేశాడట. అదేవిధంగా రష్మీ కూడా నందుపై ఫైర్ అయింది. నేను రాను.. నాకు ఈ ప్రెజర్ తీసుకోవడం ఇష్టం లేదని మొహం మీదే చెప్పేసిందట. ఇదంతా చదివి నిజంగానే రష్మీ గౌతమ్, నందు నిజంగా గొడవ పడ్డారని అనుకోకండి. బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా ప్రమోషన్స్ కోసం వీరిద్దరు ఈ ఫ్రాంక్ వీడియో చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
నందు తన సినిమా ప్రమోషన్లను కూడా వెరైటీ చేస్తూ వస్తున్నాడు. బీబీ అంటూ బిగ్ బాస్ అర్థం వచ్చేలా నందు ఆ మధ్య తన సినిమా టైటిల్ ప్రకటన మీద ప్రమోషన్స్ చేశాడు. అదే సమయంలో బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం అవుతోంది. అలా బీబీ అప్డేట్ ఇస్తున్నానని చెప్పడంతో అందరూ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తున్నాడేమో అని అనుకున్నారు. కానీ చివరకు బీబీ అంటే తన కొత్త సినిమా టైటిల్ బొమ్మ బ్లాక్ బస్టర్ అని సెలవిచ్చాడు నందు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…