Upasana : మెగాకోడలు ఉపాసన సంపాదన ఎంతో తెలుసా ?

May 13, 2022 10:22 PM

Upasana : మెగా పవర్ స్టార్‌గా రామ్ చరణ్‌ తేజ తండ్రికి తగ్గ తనయుడిగా ఎంత పేరు తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే. ఆయన నటుడిగానే కాక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక ఆయన భార్య ఉపాసన కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఈమె మూగ జీవాలపై ప్రేమ కురిపిస్తుంటారు. హైదరాబాద్‌లోని జూ పార్క్‌లో ఉన్న పలు జంతువుల సంరక్షణను ఈమె స్వయంగా చూసుకుంటున్నారు. అందుకు అయ్యే ఖర్చును కూడా ఈమె స్వయంగా భరిస్తున్నారు.

ఇక ఉపాసన 200 వృద్ధ, అనాథ ఆశ్రమాలను దత్తత తీసుకుని వాటి ఆలనా పాలనా చూస్తున్నారు. అందులో భాగంగానే ఈమె ఈ మధ్య కొందరు వృద్ధ మహిళలో సరదాగా గడిపిన ఫొటోలు వైరల్‌ అయ్యాయి. అలాగే ఉపాసన అపోలో హాస్పిటల్స్‌ చైర్మన్‌గా ఉన్నారు. దీంతోపాటు రామ్‌ చరణ్‌ కు చెందిన పలు వ్యాపారాలను కూడా ఆమె చూసుకుంటుంటారు. అయితే ఆమె ఏడాది సంపాన ఎంత ? అని సహజంగానే చాలా మందికి డౌట్‌ వస్తుంటుంది. మరి దానికి సమాధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

do you know about Upasana income
Upasana

కొణిదెల ఉపాసన ఏడాదికి దాదాపుగా రూ.30 కోట్లను సంపాదిస్తారని సమాచారం. కానీ సామాజిక సేవా కార్యక్రమాలకే ఎక్కువగా ఆమె ఖర్చు చేస్తుంటారు. దీంతో ఆమె అందరి ప్రశంసలను పొందుతుంటారు. ఇక ఉపాసన ఇటీవలే చెన్నై వెళ్లగా అక్కడ ఆమె కోవిడ్‌ బారిన పడ్డారు. దీంతో వారం పాటు హాస్పిటల్‌లో ఉండి చికిత్స పొందారు. ఈ క్రమంలోనే తనకు చికిత్సను అందించిన వైద్యులకు ఆమె సోషల్‌ మీడియా వేదికగా థ్యాంక్స్‌ చెప్పారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment