Pawan Kalyan : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన చిత్రం.. అజ్ఞాతవాసి. ఈ మూవీ పవన్ కెరీర్‌లో డిజాస్టర్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అప్పట్లో వీరి కాంబినేషన్ అంటే ఎంతో క్రేజ్ ఉండేది. దీంతో చిత్రంపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను ఈ మూవీ అందుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ టాక్‌ను మూటగట్టుకుంది.
ఇక ఈ మూవీలో పవన్ ఒక కోటీశ్వరుడికి కొడుకుగా నటించాడు. అయితే ఈ మూవీలో ఆయన ఒక లాకెట్ ధరించారు. గుర్తుంది కదా. మూవీలో ఒక లాకర్‌ను ఓపెన్ చేసేందుకు ఆ లాకెట్ ఉపయోగపడుతుంది. అయితే వాస్తవానికి ఆ లాకెట్‌పై ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది. రామ్ చరణ్ నిర్వహిస్తున్న కొణిదెల ప్రొడక్షన్ కంపెనీకి చెందిన ఆంజనేయ స్వామి బొమ్మ ఆ లాకెట్ మీద ఉంటుంది. అప్పట్లో తమ మధ్య విభేదాలు లేవు అని చెప్పేందుకు పవన్ ఆ లాకెట్‌ను ధరించారు.
అజ్ఞాతవాసి ఫంక్షన్‌లోనూ పవన్ ఈ విషయాన్ని చెప్పారు. అయితే ఆ తరువాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో అనేక విభేదాలు వచ్చినట్లు స్పష్టమవుతుంది. నాగబాబు, పవన్ జనసేనలో కీలకంగా ఉన్నారు. కానీ చిరంజీవి మాత్రం సీఎం జగన్‌తో కలివిడిగా ఉండడం మెగా ఫ్యాన్స్‌కు నచ్చడం లేదు. అయితే తమ మధ్య విభేదాలు లేవని చెప్పినప్పటికీ ఎప్పటికప్పుడు వారి మధ్య ఏదో ఒక విషయం బయట పడుతూనే ఉంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…