Thammudu Collections : ప‌వ‌ర్ స్టార్ హిట్ మూవీ త‌మ్ముడు.. అప్ప‌ట్లో ఎంత వ‌సూలు చేసిందంటే..?

Thammudu Collections : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌నను అభిమానులు దేవుడిగా భావిస్తారు. ప‌వ‌న్ కెరీర్ ఆరంభంలోనే ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ ప‌డ్డాయి. దీంతో చిరంజీవి సోద‌రుడు అయిన‌ప్ప‌టికీ సొంత టాలెంట్‌తో ఈయ‌న పైకి వ‌చ్చారు. ఇక అప్ప‌ట్లో ఈయ‌న న‌టించిన త‌మ్ముడు మూవీ సంచ‌ల‌నం సృష్టించింది. టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసిన మూవీ ఇది. ఇది ప‌వ‌న్‌కు ఎంతో లైఫ్‌ను ఇచ్చింది. దీన్ని అరుణ్ ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించారు.

త‌మ్ముడు మూవీ ప‌వ‌న్ కెరీర్‌లోనే ఒక మైలురాయిలా నిలిచిపోతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అప్ప‌ట్లో ఈ మూవీ సృష్టించిన ప్ర‌భంజ‌నం అంతా ఇంతా కాదు. ఇక ప‌వ‌న్ ఈ మూవీ అనంత‌రం వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. హిట్స్ మీద హిట్స్ ప‌డ్డాయి. కిక్ బాక్సింగ్ నేప‌థ్యంలో వ‌చ్చిన తొలి ఇండియ‌న్ మూవీ ఇదే కాగా.. ఇందులో ప‌వ‌న్ న‌ట‌న‌, డ్యాన్స్‌, ఫైట్స్ ఆక‌ర్షించాయి. దీంతో సినిమాకు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌రథం ప‌ట్టారు. అయితే అరుణ్ ప్ర‌సాద్ డైరెక్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ ఈ మూవీకి కొన్ని సీన్ల‌లో ప‌వ‌నే స్వ‌యంగా డైరెక్ష‌న్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించార‌ట‌.

Thammudu Collections

ఇక ఈ మూవీలోని లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ది మిర్ర‌ర్‌, మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ పాట‌లు.. అప్ప‌ట్లో యువ‌త‌ను ఒక ఊపు ఊపాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఏ గ‌ల్లీలో విన్నా ఇవే పాట‌లు వినిపించేవి. ఈ క్ర‌మంలోనే ఈ మూవీకి అప్ప‌ట్లోనే రూ.11 కోట్ల షేర్ వ‌చ్చింది. నిర్మాత‌ల‌కు, బ‌య్య‌ర్ల‌కు ఈ మూవీ మంచి లాభాల‌ను తెచ్చి పెట్టింది. ఇక ఈ మూవీ 60 కేంద్రాల్లో 50 రోజులు ఆడ‌గా.. 2 కేంద్రాల్లో 175 రోజుల‌కు పైగా ఆడింది. అలా ప‌వ‌న్ కెరీర్‌లోనే త‌మ్ముడు మూవీ ఒక మైలు రాయిలా నిలిచింద‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM