Liger Cast Remuneration : లైగర్ మూవీకి విజయ్, మైక్ టైసన్, రమ్యకృష్ణ, అనన్యపాండే ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే షాక‌వుతారు..!

Liger Cast Remuneration : రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లైగర్ గురువారం గ్రాండ్ గా విడుదలైంది. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే అంచనాలు తారుమారు అయ్యాయి. ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫస్ట్‌ డే మొత్తం కలెక్షన్లు 15 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా లైగర్‌ సినిమా 24.5 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది.

విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే జంటగా, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించిన లైగర్‌ చిత్రం డిజాస్టర్‌ టాక్‌ని తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వైరల్‌ అవుతోంది. భారీ బడ్జెట్‌ పాన్‌ ఇండియా మూవీకి విజయ్‌ దేవకొండ, రమ్యకృష్ణ, అనన్య పాండేలు తీసుకున్న పారితోషికం వివరాలు షాకిస్తున్నాయి. వారి రెమ్యూనరేషన్స్ ఒకసారి చూద్దాం.

Liger Cast Remuneration

లైగర్‌ చిత్రంతో పాన్‌ ఇండియా హీరోగా ఎస్టాబ్లిష్‌ చేసుకున్న విజయ్‌ దేవరకొండకి పూరీ ఏకంగా రూ.35 కోట్ల పారితోషికం ఇచ్చాడ‌ని సమాచారం. ఇది ఆర్‌ఆర్‌ఆర్‌ లో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ల పారితోషికంతో సమానమని చెప్పొచ్చు. ముందు నుంచి మైక్‌ టైసన్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు అని చెప్తూ వచ్చారు. తీరా చూస్తే.. కామెడీ పీస్ అయ్యాడు. మైక్ టైసన్ కి ఈ మూవీ కోసం ఏకంగా రూ.40కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారట. ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్రలో మెరిసిన అనన్య పాండేకి రూ.3 కోట్లు పారితోషికం ఇచ్చినట్టు సమాచారం.

అన‌న్య పాండే హీరోయిన్‌ మెటీరియల్‌ కాదని నెటిజన్లు ట్రోల్స్ చేస్తుండటం గమనార్హం. ఇక విజయ్ కి తల్లిగా నటించిన రమ్యకృష్ణకు ఈ పాత్రకి గాను కోటి రూపాయల‌ పారితోషికం అందుకున్నారట. కోచ్‌గా కనిపించిన రోనిత్‌ రాయ్‌కి కోటిన్నర పారితోషికం ఇచ్చినట్టు సమాచారం. ఇలా పారితోషికాలే వంద కోట్ల వరకు ఉన్నట్టు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో లైగర్ టీం సభ్యులే క్లారిటీ ఇవ్వాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM