Jr NTR : ఎన్టీఆర్‌కు ఇష్ట‌మైన ప‌వ‌న్ క‌ల్యాణ్ మూవీ ఏదో తెలుసా ?

August 14, 2022 7:26 PM

Jr NTR : వెండి తెరపైనే కాదు, బుల్లితెరపై కూడా ఎవరు మీలో  కోటీశ్వరుడు షోకు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ రియాలిటీ షోలో ఎన్టీఆర్ ఎన్నోసార్లు కంటెస్టెంట్స్ తో తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఎవరు మీలో కోటీశ్వరుడు షోకి చివరి ఎపిసోడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ గా వ‌చ్చారు. మహేష్ బాబు.. ఎన్టీఆర్ ని చివరి ఎపిసోడ్ లో మొదట కోటి రూపాయల ప్రశ్న అడగండి అంటూ ప్రేక్షకులను అలరిస్తూ ఆహ్లాదకరంగా ముగించారు.

ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు అత్యద్భుతంగా సమాధానాలు ఇస్తూ.. టైం ముగియడంతో మహేష్ బాబు ఎవరు మీలో కోటీశ్వరుడు నుంచి రూ.25 లక్షల‌ ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. అయితే ఇదంతా జ‌రిగిపోయిన ఎపిసోడ్‌. కానీ ఇందులో ఎన్‌టీఆర్ తెలియ‌జేసిన ప‌లు విష‌యాలు ఇప్ప‌టికీ వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. ఇక ఈ షోలో ఎన్టీఆర్ త‌న‌కు పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ చిత్రం అంటే చాలా ఇష్టం అని కంటెస్టెంట్స్ తో చెప్పారు. 1998 లో రిలీజైన తొలి ప్రేమ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది.

do you know about Jr NTR favorite Pawan Kalyan movie
Jr NTR

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించింది. స్వచ్ఛమైన ప్రేమ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తొలి ప్రేమ చిత్రం అంటే ఇష్టమని చెప్పడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తెగ సంబరపడిపోయారు. ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు కూడా మీకు ఇష్టమైన డాన్సర్ ఎవరు అంటే.. ఎన్టీఆర్ అని చెప్పడం విశేషం. స్టార్ హీరోలు ఒకరి సినిమాల గురించి మరొకరు పాజిటివ్ గా కామెంట్స్ చేయడంతో వారి అభిమానులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.

నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్, మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో కలిసి నటించి ఘన విజయాన్ని అందుకున్నారు. దీని ద్వారా అభిమానుల మధ్య జరిగే గొడవలు తప్ప‌ నిజంగా హీరోల మధ్య మంచి స్నేహబంధం ఉంటుందని.. ఎలాంటి గొడ‌వ‌లు ఉండ‌వ‌ని.. ఈ విధంగా చెప్పకనే చెప్పారు మన స్టార్ హీరోలు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now