DJ Tillu : యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ సినిమా డీజే టిల్లు. అట్లుంటది మనతోని అనేది సినిమా ట్యాగ్ లైన్. నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను విమల్ కృష్ణ డైరెక్ట్ చేసాడు. ఈ ఏడాది బాక్సాఫీసు వద్ద పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు కూడా కలెక్షన్స్ లేక థియేటర్లు వెలవెలబోతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలై కొన్ని నెలలు గడుస్తున్నా ఇప్పటికీ మూవీ లవర్స్ ఈ సినిమాను అందులోని మాటలను, పాటలను మర్చిపోలేక పోతున్నారు. ఈ సినిమా తరువాత సిద్ధు జొన్నలగడ్డ పేరు డీజే టిల్లుగా మారిపోయింది.
ఈ సినిమాలో ఆయన నటనను చూసి అందరూ జూనియర్ విజయ్ దేవరకొండ అంటూ ట్యాగ్ కూడా ఇచ్చారు. అంతలా తన హాట్ పెర్ఫార్మెన్స్ తో యూత్ ని ఆకట్టుకున్నాడు సిద్దు. అయితే డీజే టిల్లు సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు అందరూ డీజే టిల్లు పార్ట్-2 కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే డీజే టిల్లు లో హీరోయిన్ గా నటించిన నేహాశెట్టి ఈ సినిమాలో నటించదంటూ ముందుగానే చెప్పేసారు. అయితే ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించే అవకాశం ఉందంటూ నెట్టింట న్యూస్ వైరల్ అయ్యింది. దీనిపై మేకర్స్ ఖండించకపోవడంతో అంతా నిజమే అనుకున్నారు.
శ్రీలీల లాంటి యంగ్ బ్యూటీ సినిమాలో నటిస్తే సిద్దు జొన్నలగడ్డ కెరీర్ కు తిరుగుండదనుకున్నారు. యంగ్ బ్యూటీతో మాస్ సిద్దు అంటూ తెగ ప్రచారం చేశారు. అయితే రీసెంట్ గా ఏం జరిగిందో ఏమో ఈ సినిమా నుంచి శ్రీలీల అవుట్ అయిన్నట్లు తెలుస్తుంది. సిద్దులాంటి హీరోతో నటిస్తే తన కెరీర్ ఎక్కడ దెబ్బతింటుందో అన్న భయంతోనే అమ్మడు ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. దీంతో కొందరు సిద్దుని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఆకాశం చూపించి నేల నాకించేసిందిగా.. అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…