గురువారం, జూన్ 11, 2026
వార్తలు

DJ Tillu : అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. డీజే టిల్లుకి యంగ్ బ్యూటీ కోలుకోలేని షాక్..?

DJ Tillu : యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ సినిమా డీజే టిల్లు. అట్లుంటది మనతోని అనేది సినిమా ట్యాగ్ లైన్. నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను విమల్ కృష్ణ డైరెక్ట్ చేసాడు.…

DJ Tillu : అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. డీజే టిల్లుకి యంగ్ బ్యూటీ కోలుకోలేని షాక్..?

DJ Tillu : యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ సినిమా డీజే టిల్లు. అట్లుంటది మనతోని అనేది సినిమా ట్యాగ్ లైన్. నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను విమల్ కృష్ణ డైరెక్ట్ చేసాడు. ఈ ఏడాది బాక్సాఫీసు వద్ద పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు కూడా కలెక్షన్స్ లేక థియేటర్లు వెలవెలబోతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డీజే టిల్లు బ్లాక్‌ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలై కొన్ని నెలలు గడుస్తున్నా ఇప్పటికీ మూవీ లవర్స్ ఈ సినిమాను అందులోని మాటలను, పాటలను మర్చిపోలేక పోతున్నారు. ఈ సినిమా తరువాత సిద్ధు జొన్నలగడ్డ పేరు డీజే టిల్లుగా మారిపోయింది.

ఈ సినిమాలో ఆయన నటనను చూసి అందరూ జూనియర్ విజయ్ దేవరకొండ అంటూ ట్యాగ్ కూడా ఇచ్చారు. అంతలా తన హాట్ పెర్ఫార్మెన్స్ తో యూత్ ని ఆకట్టుకున్నాడు సిద్దు. అయితే డీజే టిల్లు సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు అందరూ డీజే టిల్లు పార్ట్-2 కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే డీజే టిల్లు లో హీరోయిన్ గా నటించిన నేహాశెట్టి ఈ సినిమాలో నటించదంటూ ముందుగానే చెప్పేసారు. అయితే ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించే అవకాశం ఉందంటూ నెట్టింట న్యూస్ వైరల్ అయ్యింది. దీనిపై మేకర్స్ ఖండించకపోవడంతో అంతా నిజమే అనుకున్నారు.

DJ Tillu second part sree leela reportedly rejected
DJ Tillu

శ్రీలీల లాంటి యంగ్ బ్యూటీ సినిమాలో నటిస్తే సిద్దు జొన్నలగడ్డ కెరీర్ కు తిరుగుండదనుకున్నారు. యంగ్ బ్యూటీతో మాస్ సిద్దు అంటూ తెగ ప్రచారం చేశారు. అయితే రీసెంట్ గా ఏం జరిగిందో ఏమో ఈ సినిమా నుంచి శ్రీలీల అవుట్ అయిన్నట్లు తెలుస్తుంది. సిద్దులాంటి హీరోతో నటిస్తే తన కెరీర్ ఎక్కడ దెబ్బతింటుందో అన్న భయంతోనే అమ్మడు ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. దీంతో కొందరు సిద్దుని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఆకాశం చూపించి నేల నాకించేసిందిగా.. అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి