Dj Tillu : డీజే టిల్లు పాట‌కు అదిరిపోయే రీతిలో డ్యాన్స్ చేసిన వ‌ధూవ‌రులు.. వీడియో వైర‌ల్‌..!

June 8, 2022 2:55 PM

Dj Tillu : సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, నేహాశెట్టిలు హీరోహీరోయిన్లుగా వ‌చ్చిన చిత్రం.. డీజే టిల్లు. ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గా అల‌రించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ముఖ్యంగా ఇందులోని పాటలు సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. ప్ర‌ధానంగా డీజే టిల్లు టైటిల్ సాంగ్ అయితే అదిరిపోయింది. ఈ పాట ఇప్ప‌టికీ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక పెళ్లి ఊరేగింపు స‌మ‌యాల్లో ఇప్ప‌టికే చాలా మంది ఈ పాట‌ను ప్లే చేశారు. అందుకు అదిరిపోయే రీతిలో డ్యాన్స్‌ల‌ను కూడా చేశారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ పెళ్లి ఊరేగింపు స‌మ‌యంలో ఇదే పాట‌ను మ‌ళ్లీ ప్లే చేశారు. దీంతో ఊరేగింపులో పాల్గొన్న వ‌ధువు, వ‌రుడు ఇద్ద‌రూ ఈ పాట‌కు డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకున్నారు.

ఓ పెళ్లి ఊరేగింపులో డీజే టిల్లు టైటిల్ సాంగ్‌ను ప్లే చేశారు. అందులో వ‌ధువు, వ‌రుడు ఇద్ద‌రూ కారులోనే ఉండి ఈ పాట‌కు స్టెప్పులేశారు. ఈ క్ర‌మంలో తీసిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. వారిద్ద‌రి డ్యాన్స్‌ను చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఈ పాట‌కు ఇప్ప‌టికే అనేక మంది సెల‌బ్రిటీలు సైతం డ్యాన్స్‌లు చేశారు. టీవీ షోల్లోనూ ఈ పాట అద‌ర‌గొడుతోంది. ప్రేక్ష‌కులు ఈ పాట‌ను ఎంతో ఆస‌క్తిగా వీక్షించ‌డ‌మే కాదు.. అందుకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ అల‌రిస్తున్నారు కూడా.

bride and groom danced for Dj Tillu song video viral
Dj Tillu

కాగా డీజే టిల్లు సినిమాకు శ్రీ‌చ‌ర‌ణ్ సంగీతం అందించారు. విమ‌ల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పీడీవీ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ మూవీని నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 12వ తేదీన రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. అలాగే ఓటీటీలోనూ భారీ వ్యూస్‌ను సాధించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment