Dj Tillu : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూర్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో వచ్చిన మూవీ.. డీజే టిల్లు. ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. ఎస్.థమన్ సంగీతం అందించారు. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. దీంతో సిద్ధు కెరీర్ ముఖ్యమైన టర్న్ తీసుకుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే డీజే టిల్లుకు సెకండ్ పార్ట్‌ను చిత్రీకరించాలని చూస్తున్నారు.
ఇక డీజే టిల్లు సినిమాకు మొత్తం రూ.8 కోట్లు ఖర్చు చేయగా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఈ క్రమంలోనే ఈ మూవీ మొత్తంగా రూ.30.30 కోట్ల గ్రాస్‌ను సాధించింది. రూ.17.25 కోట్ల షేర్ వచ్చింది. తెలంగాణ, ఏపీలలో ఈ మూవీ రూ.24.52 కోట్ల గ్రాస్‌ను, రూ.14.14 కోట్ల షేర్‌ను సాధించింది. ఈ సినిమాకు ఇంత రెస్పాన్స్ లభిస్తుందని అసలు ఎవరూ ఊహించలేనే లేదు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
ఈ మూవీలో సిద్ధు తనదైన శైలిలో చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన తన నటనతోనే ఈ సినిమాను హిట్ చేశారని చెప్పవచ్చు. అలాగే నేహాశెట్టి కూడా గ్లామరస్‌గా కనిపించి అదరగొట్టేసింది. అయితే డీజే టిల్లు 2 మూవీకి గాను ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఈ మూవీ గురించి త్వరలోనే ఒక అప్‌డేట్‌ను ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…