Director Maruthi : ఇండస్ట్రీలో అందరూ అలాంటి వారే.. వాడుకొని వదిలేస్తారు..

October 31, 2021 11:27 PM

Director Maruthi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ తరహాలో ఎంతో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కిస్తూ దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న వారిలో దర్శకుడు మారుతి ఒకరు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రోజుల్లో, ప్రేమ కథ చిత్రం వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఎంతటి చిన్న సినిమాల నైనా ఎంతో చాకచక్యంగా హ్యాండిల్ చేయగలడు.

Director Maruthi says that all are the same in film industry

ఇక కరోనా సమయంలో ప్రజలు భయభ్రాంతులను దృష్టిలో ఉంచుకొని కేవలం 20 రోజులలో కథను పూర్తి చేసి 30 రోజులలో సినిమాను తెరకెక్కించాలని భావించారు. ఈ క్రమంలోనే అత్యంత తక్కువ బడ్జెట్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ఇందులో అజయ్ ఘోష్ ను తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంలో మారుతి మాట్లాడుతూ ఈ సినిమాను ఒక టైం పాస్ కోసం తీశాను, అయితే ఈ సినిమా చాలా సీరియస్ గా వచ్చిందని మారుతి తెలియజేశారు.

ఇక హీరో సంతోష్ గురించి మాట్లాడుతూ.. యు.వి.క్రియేషన్స్ ప్రస్తుతం సంతోష్ తో సినిమాలు తీస్తున్నారని తెలిపారు యు.వి.క్రియేషన్స్ వారికి ఎవరైనా ఒక రూపాయలు చెల్లిస్తే వారు వంద రూపాయలు తిరిగి చెల్లిస్తారని వాళ్ళు ఎవరి రుణం ఉంచుకోరని ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి తెలియజేశారు. అయితే ఇండస్ట్రీలో చాలామంది వాడుకొని వదిలేసే వారే ఉంటారు కానీ ఇలాంటి వారు ఉండడం ఇండస్ట్రీలో చాలా అరుదు అంటూ డైరెక్టర్ మారుతి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment