Anchor Devi : యాంక‌ర్ దేవిపై ఆ ద‌ర్శ‌కుడు ఫైర్.. నేనైతే నాలుగు త‌న్నేవాడిని.. అని కామెంట్స్‌..!

Anchor Devi : ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఉన్న హాట్ టాపిక్ ఏంటంటే విశ్వక్ సేన్- దేవి మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌. విశ్వక్ సేన్ తన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం ప్రమోషన్స్‌లో భాగంగా ప్రాంక్ వీడియో చేసి వివాదంలో చిక్కుకోగా, ఈ ప్రాంక్ వీడియోపై ఓ తెలుగు టీవీ ఛానల్ చర్చా కార్యక్రమం నిర్వహించగా.. ఆ ఛానల్ యాంకర్‌కు, విశ్వక్ సేన్‌కు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ఆవేశానికి గురైన విశ్వక్ సేన్ ఓ అభ్యంతరకర పదం వాడడం విమర్శలకు దారితీసింది. దీంతో సదరు యాంకర్ అతన్ని గెట్ ఔట్ అంటూ బయటకు పంపింది.

Anchor Devi

దేవి నాగవ‌ల్లి .. విశ్వ‌క్‌ని దారుణంగా అవ‌మానించ‌డం, ఆ త‌ర్వాత త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌ని క‌లిసి విశ్వ‌క్‌పై కంప్లైంట్ చేయ‌డం వంటివి జ‌రిగాయి. దేవి వెంట జర్నలిస్ట్ ఫోరం సభ్యులు కూడా ఉన్నారు. దేవి ఫిర్యాదుపై మంత్రి తలసాని స్పందించారు. ఈ అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలా ప్రాంక్ వీడియోల పేరిట రోడ్లపై ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని, దీనిపై తాను పోలీసు అధికారులతో మాట్లాడతానని చెప్పారు. యాంకర్ దేవి నాగవల్లి, హీరో విశ్వక్సేన్ మధ్య జరిగిన వాగ్వాదాన్ని కూడా తాను చూశానని తెలిపారు. అలాంటి ప్రవర్తనను ఎవరూ అంగీకరించరని స్పష్టం చేశారు.

అయితే యాంకర్ దేవి – విశ్వక్ సేన్‌ల మధ్య గొడవపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొంద‌రు విశ్వ‌క్ సేన్‌ని స‌పోర్ట్ చేస్తుండ‌గా, మ‌రి కొందరు మాత్రం దేవిని స‌పోర్ట్ చేస్తున్నారు. అయితే పెద్ద హీరోల‌ని దేవి ఆ మాట అనగలదా ? బయటకు పొమ్మనగలరా ? అంటూ విశ్వక్ సేన్‌కి మద్దతుగా నిలుస్తున్నారు చాలామంది నెటిజన్లు. ఈ నేపథ్యంలో యువ దర్శకుడు బండి సరోజ్ కుమార్ స్పందిస్తూ.. వాడు మంచోడు కాబట్టి.. ఆ ప‌దం అని సరిపెట్టాడు.. నేనైతే నాలుగు తగిలించేవాడ్ని.. నా దృష్టిలో జెండర్ కార్డ్ అనేది జాతి, కులం, మతం కార్డ్స్‌కి ఏ మాత్రం అతీతం కాదు.. ఫస్ట్ మనిషి.. అంటూ యాంకర్ దేవికి ఇన్ డైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చాడు. కాగా బండి సరోజ్ కుమార్.. నిర్భంధం, నిర్భధం 2 చిత్రాలతో పేరు సంపాదించుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM