Dimple Hayathi : అనేక అవ‌మానాల‌ను ఎదుర్కొంటూ ఈ స్థాయికి వ‌చ్చా.. ఖిలాడి హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌..!

January 30, 2022 8:13 PM

Dimple Hayathi : ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌కత్వంలో మాస్ మ‌హారాజ ర‌వితేజ హీరోగా, డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రిలు హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం.. ఖిలాడి. ఇందులో డింపుల్ హ‌యతి అదిరిపోయేలా గ్లామ‌ర్ షో చేసింది. ఇటీవ‌లే విడుద‌లైన ఫుల్ కిక్కు సాంగ్‌లో డింపుల్ త‌న మాస్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టింది. అయితే తాజాగా ఈ అమ్మ‌డు త‌న కెరీర్‌కు సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించింది.

Dimple Hayathi told that she faced many insults to come into film industry
Dimple Hayathi

తాను కొంచెం రంగు త‌క్కువ‌గా ఉన్నాన‌ని చెప్పి త‌న‌ను అవ‌మానించార‌ని డింపుల్ హ‌య‌తి పేర్కొంది. త‌న‌కు టాలీవుడ్‌లో అంత సుల‌భంగా ఏమీ అవ‌కాశాలు రాలేద‌ని, రంగు త‌క్కువ‌గా ఉన్నాన‌నే కార‌ణంతో త‌న‌కు అవ‌కాశాలు ఇవ్వలేద‌ని తెలిపింది. అయితే ప్ర‌స్తుతం ప‌రిస్థితులు మారాయ‌ని, ప్ర‌తిభ ఉన్న‌వారినే ఆద‌రిస్తున్నార‌ని, క‌నుక రంగుతో ప‌నిలేద‌ని ఈమె చెప్పుకొచ్చింది.

Dimple Hayathi : డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టింద‌ని..

డింపుల్ స‌హ‌జంగానే ప్రొఫెష‌న‌ల్ డ్యాన్స‌ర్‌. గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ చిత్రంలో సూప‌ర్ హిట్టు ఐట‌మ్ సాంగ్‌లో అల‌రించింది. ఈ క్ర‌మంలోనే ఖిలాడిలోనూ డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టింద‌ని తెలుస్తోంది. అయితే ఆ ఐట‌మ్ సాంగ్ త‌రువాత త‌న‌కు అనేక అవ‌కాశాలు అలాంటివే వ‌చ్చాయ‌ని, కానీ హీరోయిన్‌గా తొలిసారి అవ‌కాశం వ‌చ్చింద‌ని.. ఇది త‌న‌కు స‌రైన అవ‌కాశ‌మ‌ని తెలిపింది. మ‌రి ఖిలాడి మూవీ ఈ అమ్మ‌డికి హిట్‌ను అందిస్తుందా.. ఈమె కెరీర్ గ్రాఫ్‌ను పెంచుతుందా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment