Dil Raju : కొడుకు పుట్టిన ఆనందం.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న దిల్ రాజు..?

July 5, 2022 3:08 PM

Dil Raju : తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న మొద‌ట్లో డిస్ట్రిబ్యూట‌ర్‌గా ఉండేవారు. ఆయ‌న సినిమాల‌కు డిస్ట్రిబ్యూట‌ర్‌గా ఉండి స‌క్సెస్ సాధించారు. త‌రువాత ఆచి తూచి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఆరంభంలో ఆయ‌న సినిమాల‌ను తీసే విష‌యంలో చాలా జాగ్ర‌త్త ప‌డేవారు. చెత్త సినిమాలు తీసేవారు కాదు. అందువ‌ల్ల దిల్ రాజు సినిమా అంటే మినిమ‌మ్ మార్కెట్ ఉండేది. అలా ఆయ‌న నిర్మాత‌గా కూడా స‌క్సెస్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఆయ‌న టాలీవుడ్ టాప్ నిర్మాత‌ల్లో ఒక‌రిగా ఉన్నారు.

ఇక దిల్ రాజుకు ఈ మ‌ధ్యే కుమారుడు జ‌న్మించిన విష‌యం విదిత‌మే. ఆయ‌న రెండో భార్య తేజ‌స్విని మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. మొద‌టి భార్య అనిత రెడ్డి చ‌నిపోయాక ఆయ‌న తేజ‌స్వినిని వివాహం చేసుకున్నారు. క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో కొద్ది మంది స్నేహితులు, బంధువుల స‌మ‌క్షంలో ఆయ‌న వివాహం జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే తేజ‌స్విని తాజాగా మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. అయితే కొడుకు పుట్టాక దిల్ రాజు ప‌డుతున్న సంతోషం ఇంతా కాదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న కొడుకును చేతుల్తో ఎత్తుకుని మురిసిపోతున్న ఫొటో ఒక‌టి తాజాగా సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయింది.

Dil Raju took important decision after his son is born
Dil Raju

అయితే కొడుకు పుట్టాడ‌న్న ఆనందంలో దిల్ రాజు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారని తెలుస్తోంది. ఆయ‌న హైద‌రాబాద్‌లో కెల్లా అతి పెద్ద ఫిలిం స్టూడియోను నిర్మించాల‌ని చూస్తున్నార‌ట‌. అందుక‌నే శంషాబాద్ ద‌గ్గ‌ర భారీగా స్థ‌లాన్ని కొనుగోలు చేస్తార‌ని తెలుస్తోంది. అక్క‌డే ఆయ‌న త‌న స్టూడియోను నిర్మిస్తార‌ని స‌మాచారం. లేక లేక కొడుకు పుట్ట‌డం.. వార‌సుడు ల‌భించ‌డంతో ఆయ‌న త‌న వార‌స‌త్వాన్ని కొన‌సాగించ‌డం కోసం కొడుకు కోసం ఓ స్టూడియోను నిర్మిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ వార్త సామాజిక మాధ్య‌మాల్లో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇక దీనిపై త్వ‌ర‌లోనే అధికారికంగా వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నార‌ని స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now