Dil Raju : నిఖిల్ కార్తికేయ 2 ని దిల్ రాజు టార్గెట్ చేశారా ? అసలు తెర వెనుక ఏం జరుగుతోంది ?

Dil Raju : దిల్‌ రాజు అంటేనే సక్సెస్‌.. సక్సెస్‌ అంటేనే దిల్‌ రాజు.. అన్నంతలా ఉంటుంది. దిల్ రాజు ఓ సినిమా కథను ఓకే చేశాడంటే కచ్చితంగా దాంట్లో విషయం ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుకు తెలుగు సినీ పరిశ్రమలో ఎదురు లేదనే విషయం తెలిసిందే. ఆయన ఓ సినిమా తీస్తున్నారంటే పోటీపడి కొనుక్కుంటారు. ఇంత గుడ్ విల్ ఉన్న దిల్ రాజు ఇప్పుడు రెండు పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఒకటి విజయ్ తో వారసుడు, మరొకటి తమిళ దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వ‌స్తోంది. మరోపక్క స్టార్స్ సినిమాల‌ను డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు. బింబిసారని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తే మంచి లాభాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయనకు ఓ కాంట్రవర్సీ చుట్టుకుంది. అదేమిటంటే..

నిఖిల్ హీరోగా 2014 సంవత్సరంలో రూపొందిన కార్తికేయ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్ చేస్తామని అప్పట్లోనే ప్రకటించారు. ఎట్టకేలకు సినిమా జూలై 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధం అయింది. అయితే సినిమా విడుదలకు థియేటర్లు దొరక్క సినిమా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అదే సమయానికి నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా కూడా విడుదలవుతున్న నేపథ్యంలో నిఖిల్ సినిమా వాయిదా పడింది. కార్తికేయ 2 నిర్మాతలు రిలీజ్ కోసం చాలా తిప్పలు పడ్డారు. దిల్ రాజు బలం ముందు వీరి బలగం సరిపోలేదని కామెంట్స్ వచ్చాయి.

Dil Raju

కార్తికేయ 2 సినిమాకి థియేటర్స్ లేకపోవడంతో ఆగస్టు 13కు రిలీజ్ డేట్ ను మార్చుకొని రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా ఫిల్మ్ గా వచ్చింది. దాంతో దిల్ రాజు కారణంగా మిగిలిన భాషల్లో కూడా సినిమాని పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఆల్ రెడీ సినిమా ప్రమోషన్స్ కోసం బాగా ఖర్చు పెట్టారు. ఇప్పుడు అదంతా వృథా అయిపోయింది. కాకపోతే సినిమా హిట్ టాక్ రావటంతో టీమ్ రిలీఫ్ అయ్యింది.

అయితే శుక్రవారం నితిన్ సినిమా మాచర్ల నియోజకవర్గం విడుదల అయింది. నైజాంలో దిల్ రాజు పంపిణీ చేశారు. మరో క్క ఆగస్ట్ 5న కళ్యాణ్ రామ్ బింబిసార రిలీజ్ అయింది. ఆ సినిమాను కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు. దీంతో క‌చ్చితంగా థియేటర్స్ విషయంలో ఇబ్బందులు వచ్చాయి. ఎందుకంటే బింబిసార సూపర్ హిట్ కావడంతో ఆ థియేటర్స్ తీయడానికి లేదు.

నితిన్ మాచర్లకు ఎక్కువ థియేటర్స్ కేటాయించాలి. కాబట్టి చాలా భాగం థియేటర్స్ దిల్ రాజు రిలీజ్ ల వైపే ఉండిపోతాయి. ప్రైమ్ థియేటర్స్ నిఖిల్ సినిమాకు దొరకడం కష్టమైపోయాయని వినికిడి. ఇలా దిల్ రాజు.. ఈ సినిమాని ఇబ్బంది పెట్టినట్లే అయ్యింది. కాకపోతే ఇవన్నీ బిజినెస్ లో కామన్ అని జనాలు అనుకుంటున్నారు. ఏదేమైనా గత కొన్నేళ్లుగా నిఖిల్ రెగ్యులర్ హీరోయిజం కన్నా కంటెంట్ బలంగా ఉన్న కథలకే ఓటేస్తున్నాడు. ఈ క్రమంలో వచ్చిన మరో చిత్రం కార్తికేయ 2. థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులు తప్పకుండా చూడదగ్గ సినిమాగా పేరు తెచ్చుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM