Jayam Movie Yamini : విలక్షణ దర్శకుడు తేజ తెరకెక్కించిన అద్భుతమైన ప్రేమ కావ్యం జయం. ఇందులోని ప్రతి పాత్రను ఎంతో అద్భుతంగా మలిచాడు డైరెక్టర్. ఇందులో పక్కింటి అమ్మాయిలా కనిపించే సదా లుక్స్, గోపీచంద్ విలనిజం, ఆర్పీ పట్నాయక్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ హైలెట్‌గా నిలిచాయి. ముఖ్యంగా ఇందులో అక్షరాలను తిప్పిరాసే హీరోయిన్ చెల్లెలి పాత్ర అందరినీ ఆకర్షించింది. తన అక్క ప్రేమ గెలవాలని ఈ పాప చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.
సుద్ద ముక్కతో అక్షరాలను తిరగేసి రాస్తూ అందరినీ కన్‌ఫ్యూజ్ చేస్తుంటుంది. ఈ పాత్రకి గాను ఆ పాపకి నంది అవార్డు లభించింది. ఆ పాప పేరు.. యామిని శ్వేత. ఈమె ప్రముఖ సీరియల్ ఆర్టిస్ట్ జయలక్ష్మి కూతురు అన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. జయం చిత్రం కంటే ముందు యామిని కొన్ని సీరియల్స్ లో నటించింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన ఆమె అక్కడ చదువు పూర్తయ్యాక కొన్నాళ్ళు ఉద్యోగం కూడా చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న యామినికి ఓ పాప కూడా ఉంది.
అప్పట్లో యామినికి నచ్చావులే వంటి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ వాటిని సున్నితంగా తిరస్కరించింది. ఇక నంది అవార్డుకు వచ్చిన రెమ్యునరేషన్‌ను కూడా మానసిక వికలాంగుల ఆశ్రమానికి దానం చేసి తన గొప్ప మనసును చాటుకుంది. ఇప్పుడు యామిని అందాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. అయితే ఇప్పుడు యామిని శ్వేత సినిమాల్లో నటిస్తే బాగుంటుందని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. ఇక ముందైనా సినిమాల్లో నటించేందుకు యామిని ఓకే చెప్తుందో లేదో చూడాలి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…