Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు మళ్లీ తండ్రి అయ్యారు. ఆయన రెండో భార్య వైఘా రెడ్డి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దిల్ రాజు, వైఘా రెడ్డిలకు 2020లో లాక్ డౌన్ సమయంలో వివాహం జరిగింది. ఆయన మొదటి భార్య అనితా రెడ్డి 2017లో మృతి చెందిన విషయం విదితమే. తరువాత ఆయన వైఘా రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు ప్రస్తుతం కొడుకు పుట్టాడు. జూన్ 29 రాత్రి ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
కాగా దిల్‌రాజు మొదటి భార్యకు హర్షిత రెడ్డి అనే కుమార్తె జన్మించగా.. ఈమెకు వివాహం అయి పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే దిల్ రాజు, వైఘా రెడ్డిల వివాహం జరిగినప్పుడు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అయితే వీరు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తల్లిదండ్రులు అయ్యారు. దీంతో దిల్ రాజు దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నయి.
దిల్ రాజు ఇప్పటికే అనేక హిట్ చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం ఈయన శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే విజయ్ వారసుడుతోపాటు పలు ఇతర చిత్రాలతో కూడా ఈయన బిజీగా ఉన్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…