Dil Raju : దిల్ రాజు రాయ‌బారం.. వివాదాలకు ఫుల్ స్టాప్ ప‌డుతుందా ?

October 1, 2021 4:42 PM

Dil Raju : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింద‌న్న చందంగా మారింది ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ప‌రిస్థితి. మొన్నా న‌డుమ రిప‌బ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ వైసీపీ ప్ర‌భుత్వం, మంత్రుల‌పై వ్యాఖ్య‌లు చేయ‌డం ఏమో గానీ.. అక్క‌డ వేడుక‌లో స్టేజీ ఎదురుగా ఉండి న‌వ్వినందుకు దిల్ రాజు హుటాహుటిన మంత్రి పేర్ని నానిని వెళ్లి క‌లిశారు. అబ్బే.. ప‌వ‌న్ అలా అన్నారు కానీ.. దానికి మాకు ఏం సంబంధం లేదు, ఆ వ్యాఖ్య‌లు ఆయ‌న వ్య‌క్తిగ‌తం అని మంత్రి నానికి స్వ‌రం వినిపించారు.

Dil Raju : దిల్ రాజు రాయ‌బారం.. వివాదాలకు ఫుల్ స్టాప్ ప‌డుతుందా ?

అయితే మంత్రి పేర్ని నానిని క‌లిసేందుకు వెళ్లిన నిర్మాతలంద‌రితోనూ దిల్ రాజు మ‌ళ్లీ ప‌వ‌న్‌ను క‌లిశారు. దీంతో ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. దిల్ రాజు నిర్మిస్తున్న ప‌లు సినిమాలు భ‌విష్య‌త్తులో విడుద‌ల కానున్నాయి. అవి విడుద‌ల అయ్యే వ‌ర‌కు ఎలాంటి ఉద్రిక్త వాతావ‌ర‌ణం లేకుండా శాంతియుతంగా ఉండాల‌ని.. ఈ వివాదాల‌న్నీ స‌ద్దుమ‌ణ‌గాల‌ని.. అప్పుడే త‌న‌కు గానీ, ఇత‌ర నిర్మాత‌ల‌కు గానీ ఎలాంటి భ‌యం లేకుండా ఉంటుంద‌ని దిల్ రాజ్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుక‌నే ఆయ‌న అటు ఏపీ ప్ర‌భుత్వానికి, ఇటు ప‌వ‌న్‌కు మ‌ధ్య రాయ‌బారం న‌డిపిస్తున్న‌ట్లు అర్థం చేసుకోవ‌చ్చు.

ప‌ర‌స్ప‌రం వ్యాఖ్య‌లు, విమ‌ర్శ‌లు చేసుకున్న ప‌వ‌న్, వైసీపీ మంత్రులు బాగానే ఉన్నారు, కానీ దెబ్బ ప‌డేది నిర్మాత‌ల‌కే. ఇప్ప‌టికే క‌రోనా వ‌ల్ల తీవ్ర న‌ష్టాల్లో ఉన్న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు మ‌ళ్లీ పూర్వ రోజులు రావాలంటే చాలా కాలం వేచి చూడ‌క త‌ప్ప‌ని పరిస్థితి నెల‌కొంది. ఇలాంటి గ‌డ్డు స‌మ‌యంలో ఈవిధంగా వివాదాలు వ‌స్తే అవి నిర్మాత‌ల‌కు ఏమాత్రం మంచివి కావు. క‌నుకనే దిల్ రాజు నేతృత్వంలో వారంద‌రూ కాళ్ల‌కు బ‌ల‌పాలు క‌ట్టుకుని అటు, ఇటు తిరుగుతున్నారు. మ‌రి దిల్ రాజు రాయ‌బారం ఫ‌లిస్తుందా ? వివాదాల‌న్నీ స‌ద్దుమ‌ణిగిపోతాయా ? అన్న‌ది తెలియాలంటే.. మ‌రికొంత కాలం వేచి చూడ‌క త‌ప్ప‌దు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now