Digangana Suryavanshi : సినిమాల్లోకి వచ్చాక చదువుపై శ్రద్ధ తగ్గడం సహజం. ఎంత మేనేజ్ చేసినా కూడా కొన్ని సందర్భాలలో కోరుకున్న ఫలితాలు రావు. తాజాగా హిప్పీ బ్యూటీ దిగంగన సూర్యవంశీ తన బీఏ డిగ్రీని పూర్తి చేసింది. అయితే మూడేళ్లలో పూర్తి చేయాల్సిన డిగ్రీకి దిగంగనా ప్రొఫెషనల్ కమిట్ మెంట్స్ వల్ల 5 ఏళ్ల సమయం పట్టింది. ఏడేళ్ల వయస్సు నుంచి ఓ వైపు స్టడీస్‌ను, మరోవైపు వృత్తిపరమైన కమిట్‌మెంట్స్ ను బ్యాలెన్సింగ్ చేస్తూ విజయవంతంగా ముందుకెళ్తున్నానని చెప్పింది.
హీరోయిన్ దిగంగన సూర్యవంశీ.. బాలీవుడ్‌లో పలు సీరియళ్లలో నటించి.. ‘ఏక్ వీర్ కి అర్దాస్ … వీరా’తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత హిందీ బిగ్‌బాస్-9లోకి వెళ్లింది. తెలుగులో యువహీరో కార్తికేయతో కలిసి ‘హిప్పీ’ సినిమాలో నటించింది. గోపిచంద్ హీరోగా నటించిన సీటీమార్ చిత్రంలో రెండో హీరోయిన్‌గా నటించి మంచి మార్కులు కొట్టేసింది.
ఇటీవలే తనకిష్టమైన ఎంబీఏ ప్రోగ్రామ్‌లో చేరింది దిగంగనా. చిన్ననాటి నుంచి తాను మంచి విద్యార్థిని అని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సినిమాలతో బిజీగా ఉన్నా చదువుని మాత్రం అశ్రద్ధ చేయలేదు. దిగంగనా సూర్యవంశీ ప్రస్తుతం బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టు ది బాటిల్ ఆఫ్ భీమా కోరెగావ్, డార్క్ పాత్ సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు తెలుగులో సందీప్ కిషన్‌తోనూ సినిమా చేస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…