Digangana Suryavanshi : మూడేళ్ల డిగ్రీని ఐదేళ్ల‌కు పూర్తి చేసిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా ?

November 26, 2021 1:26 PM

Digangana Suryavanshi : సినిమాల్లోకి వ‌చ్చాక చ‌దువుపై శ్ర‌ద్ధ త‌గ్గ‌డం స‌హజం. ఎంత మేనేజ్ చేసినా కూడా కొన్ని సంద‌ర్భాల‌లో కోరుకున్న ఫ‌లితాలు రావు. తాజాగా హిప్పీ బ్యూటీ దిగంగ‌న సూర్య‌వంశీ త‌న బీఏ డిగ్రీని పూర్తి చేసింది. అయితే మూడేళ్ల‌లో పూర్తి చేయాల్సిన డిగ్రీకి దిగంగ‌నా ప్రొఫెష‌న‌ల్ క‌మిట్ మెంట్స్ వ‌ల్ల 5 ఏళ్ల స‌మ‌యం ప‌ట్టింది. ఏడేళ్ల వ‌య‌స్సు నుంచి ఓ వైపు స్ట‌డీస్‌ను, మ‌రోవైపు వృత్తిప‌ర‌మైన క‌మిట్‌మెంట్స్ ను బ్యాలెన్సింగ్ చేస్తూ విజ‌యవంతంగా ముందుకెళ్తున్నాన‌ని చెప్పింది.

Digangana Suryavanshi completed degress in 5 years instead of 3

హీరోయిన్ దిగంగన సూర్యవంశీ.. బాలీవుడ్‌లో పలు సీరియళ్లలో నటించి.. ‘ఏక్ వీర్ కి అర్దాస్ … వీరా’తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత హిందీ బిగ్‌బాస్‌-9లోకి వెళ్లింది. తెలుగులో యువహీరో కార్తికేయతో కలిసి ‘హిప్పీ’ సినిమాలో నటించింది. గోపిచంద్‌ హీరోగా నటించిన సీటీమార్‌ చిత్రంలో రెండో హీరోయిన్‌గా నటించి మంచి మార్కులు కొట్టేసింది.

ఇటీవ‌లే త‌న‌కిష్ట‌మైన ఎంబీఏ ప్రోగ్రామ్‌లో చేరింది దిగంగ‌నా. చిన్ననాటి నుంచి తాను మంచి విద్యార్థిని అని తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది. సినిమాల‌తో బిజీగా ఉన్నా చ‌దువుని మాత్రం అశ్ర‌ద్ధ చేయ‌లేదు. దిగంగ‌నా సూర్య‌వంశీ ప్ర‌స్తుతం బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టు ది బాటిల్ ఆఫ్ భీమా కోరెగావ్, డార్క్ పాత్‌ సినిమాల్లో న‌టిస్తోంది. మరోవైపు తెలుగులో సందీప్ కిష‌న్‌తోనూ సినిమా చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment