Dhruva Movie : ధృవ సినిమాలో చూపించిన 8.. అష్ట దిగ్బంధనం.. అంటే ఏమిటో తెలుసా..?

Dhruva Movie : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ‌, ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డిల కాంబినేష‌న్ లో వ‌చ్చిన ధృవ మూవీ ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇందులో చ‌ర‌ణ్‌కు జోడీగా ర‌కుల్ న‌టించింది. అలాగే మ‌రో ముఖ్య పాత్ర‌లో అర‌వింద్ స్వామి యాక్టింగ్‌ను అద‌ర‌గొట్టేశారు. ఈ మూవీ 9 డిసెంబ‌ర్ 2016వ తేదీన రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ టైటిల్‌లో ధ అనే అక్ష‌రం మీద 8 అనే నంబ‌ర్‌ను ఉంచుతారు. దీంతో ఈ సినిమాపై మ‌రింత ఆస‌క్తి క‌లిగింది. అయితే ఈ 8 అంకెకు, ఇందులో వాడిన అష్ట దిగ్బంధనం అనే ప‌దానికి ఉన్న అర్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మూవీలో ఇచ్చిన 8 అంటే.. అష్ట దిగ్బంధనం అనే ప‌దానికి.. శత్రువును తుదముట్టించే ముందు ఎనిమిది దిక్కుల నుండి రౌండప్ చేయాలి. అంటే పారిపోడానికి అవ‌కాశ‌మే లేకుండా చేయాలి. అలాగే ధృవ సినిమాలో కూడా రామ్ చరణ్ విలన్ అరవింద్ స్వామిని అన్ని విధాలుగా రౌండప్ చేస్తాడు. కాకపోతే దిక్కుల ప్రకారంగా కాకుండా విలన్ ఎదిగిన క్రమాన్ని ఒక్కొక్కటిగా దెబ్బ తీస్తాడు. అంటే అత‌నికి ఉండే కీర్తి, ధ‌నం ఇలా అన్నింటినీ ఒక్కోదాన్ని దూరం చేస్తూ వ‌స్తాడు. చివ‌ర‌కు మ‌ర‌ణం వ‌స్తుంది.

Dhruva Movie

అష్ట దిగ్బంధనం అనే దాన్ని ఈ మూవీలో ఇంకో విధంగా ఉప‌యోగించారు. విల‌న్‌కు ఉన్న 8 అవ‌కాశాలు దెబ్బ తీస్తాడు. అంటే.. ఓ గొప్ప సైంటిస్ట్ గా సమాజంలో గౌరవింపబడే వ్యక్తిని అదే సమాజం చేత ఛీ కొట్టించి అత‌ని కీర్తిని దెబ్బ తీస్తాడు. అలాగే ఇతరుల ఆవిష్కరణలను తన ఆవిష్కరణలుగా పేటెంట్ హక్కులు పొందాడని తెలియజేస్తూ అత‌ని మేథ‌స్సును దెబ్బ తీస్తాడు. తన బలాన్నంతా పోగొడ‌తాడు. కన్న తండ్రినే చంపాలని చూసిన అతడి చర్యను అత‌డి తండ్రికే తెలియ‌జేస్తూ అత‌న్ని ఎమోష‌న‌ల్‌గా దెబ్బ తీస్తాడు.

త‌రువాత అత‌ని ధైర్యాన్ని ఎదిరించి దెబ్బ కొడ‌తాడు. అలాగే ఓ డీల్ కోసం అంతా రెడీ చేసుకున్న డబ్బును సమయానికి అందకుండా అడ్డుకుని డ‌బ్బు ప‌రంగా దెబ్బ కొడ‌తాడు. అలాగే మాన‌వ‌త్వాన్ని కూడా పోగొడ‌తాడు. ఇలా ఏడింటిని చ‌ర‌ణ్ దూరం చేస్తాడు. అయితే 8వ అంశం అయిన మ‌ర‌ణంపై మాత్రం చ‌ర‌ణ్ దృష్టి పెట్ట‌డు. కానీ తాను అష్ట దిగ్బంధనం అయ్యాన‌న్న విష‌యాన్ని గ్ర‌హించిన విల‌న్ త‌న మ‌ర‌ణాన్ని తానే ఫిక్స్ చేసుకుంటాడు. ఇలా అత‌ని మ‌ర‌ణంతో మొత్తం అష్ట దిగ్బంధనం పూర్త‌వుతుంది. దీన్ని ఈ మూవీలో చాలా చక్క‌గా చూపించారు. సినిమా హిట్ అయ్యేందుకు ఇది ఒక ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM