Anushka Shetty : అనుష్క‌శెట్టిని దూరం పెట్టిన నాగార్జున..? ఎందుకు..?

Anushka Shetty : తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు జేజ‌మ్మ‌గా పేరుగాంచిన అనుష్క శెట్టి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ఎన్నో చిత్రాల్లో న‌టించినా.. అరుంధ‌తి ద్వారానే ఎక్కువ‌గా పేరు వ‌చ్చింది. టాలీవుడ్‌లో సీనియ‌ర్ అగ్ర హీరోలు చాలా మందితో ఈమె న‌టించింది. అయితే సైజ్ జీరో అనే మూవీ ద్వారా ఈమె బాగా లావుగా మారిపోవ‌డం.. త‌రువాత బ‌రువు త‌గ్గాల‌నుకున్నా అది సాధ్యం కాక‌పోవ‌డంతో.. ఈమెకు సినిమాల్లో ఆఫ‌ర్లు త‌గ్గాయి. బాహుబ‌లి త‌రువాత దాదాపుగా సినిమా ఇండ‌స్ట్రీకి ఈమె దూర‌మైంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఒక‌టి రెండు సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని సాధించ‌లేదు. అయితే తాజాగా అనుష్క శెట్టికి చెందిన ఓ వార్త ఫిలిం న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

తెలుగులో అనుష్క మొద‌టి చిత్రం సూప‌ర్‌. ఇందులో ఆమె నాగార్జున‌తో క‌లిసి న‌టించింది. త‌రువాత కూడా వీరు ప‌లు చిత్రాల్లో క‌ల‌సి న‌టించారు. అలాగే నాగార్జున సినిమాల్లో ఈమె కొన్ని పాట‌ల్లోనూ ప్ర‌త్యేకంగా క‌నిపించింది. దీంతో వీరిమ‌ధ్య అఫైర్ ఉందంటూ అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. త‌రువాత ఆమెను చైత‌న్యకు ఇచ్చి పెళ్లి చేయ‌నున్నార‌నే వార్త‌లు కూడా వైర‌ల్ అయ్యాయి. అయితే వాటిని నాగార్జున ఖండించారు. ఇక తాజాగా అనుష్క శెట్టికి, నాగార్జున‌కు మ‌ధ్య దూరం పెరిగింద‌ని తెలుస్తోంది.

Anushka Shetty

అనుష్క శెట్టిని నాగార్జున ప్ర‌స్తుతం దూరం పెట్టార‌ట‌. ఈ మేర‌కు టాలీవుడ్ లో వార్త‌లు గుప్పుమంటున్నాయి. అయితే ఈమెను ఆయ‌న ఎందుకు దూరంగా పెట్టాడు.. అన్న విష‌యాలు మాత్రం బ‌య‌ట‌కు రావ‌డం లేదు.. కానీ చైత‌న్య‌తో అనుష్క పెళ్లి వార్త‌ల‌పై ఆమె త‌ల్లి బాగా హ‌ర్ట్ అయింద‌ట‌. అందుక‌నే నాగార్జున ఫ్యామిలీకి దూరంగా ఉండాల‌ని ఆమె చెప్పింద‌ట‌. దీంతో అనుష్క అక్కినేని కుటుంబానికి దూరంగా ఉంటుంద‌ని స‌మాచారం. దీంతో నాగార్జున కూడా ఆమెకు దూరంగానే ఉంటున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఈ వార్త సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.

ఇక నాగార్జున, అనుష్క శెట్టి క‌ల‌సి సూప‌ర్‌, డాన్‌, కింగ్‌, కేడీ, ర‌గ‌డ‌, ఢ‌మ‌రుకం, సోగ్గాడే చిన్ని నాయ‌నా, ఊపిరి, ఓం న‌మో వెంక‌టేశాయ‌.. త‌దిత‌ర చిత్రాల్లో న‌టించారు. కాగా అనుష్క శెట్టి చివ‌రిసారిగా నిశ్శ‌బ‌ద్ధం అనే మూవీలో న‌టించింది. ఇది 2020లో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వ‌ద్ద మాత్రం నిరాశ ప‌రిచింది. అప్ప‌టి నుంచి ఈమె ఖాళీగానే ఉంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM