DHEE : చిరు స్టెప్పులతో అదరగొట్టిన ఆది.. ముద్దులతో మళ్లీ రెచ్చిపోయిన పూర్ణ!

November 6, 2021 7:54 PM

DHEE : ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా పరిచయమైన ఆది గురించి అందరికీ తెలిసిందే. తన కామెడీతో, పంచులతో మంచి గుర్తింపు తెచ్చుకొని అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించాడు. జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ డాన్స్ షోలో కూడా చేస్తూ బాగా బిజీగా మారాడు. ఇదిలా ఉంటే తాజాగా చిరు స్టెప్పులతో డాన్స్ చేసి అదరగొట్టాడు.

DHEE hyper aadi mesmerized with chiranjeevi songs dance steps

మామూలుగా ఆదికి డాన్స్ పర్ఫార్మెన్స్ ఎక్కువగా రాదు. చాలా వరకు ఆయన చేసే డాన్స్ చాలా కామెడీగా అనిపిస్తుంది. కానీ తాజాగా విడుదలైన ఢీ ప్రోగ్రాం ప్రోమోలో అతని డాన్స్ పర్ఫార్మెన్స్ బాగా వైరల్ గా మారింది. ప్రస్తుతం ఢీ షోకు సంబంధించి వచ్చే ఎపిసోడ్ కు చెందిన ప్రోమో విడుదల అయింది. అందులో ఆది మెగాస్టార్ చిరంజీవి పాటలతో ఆయనలా స్టెప్పులు వేశాడు.

ఇక ఈయన డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి అందరూ ఫిదా అయ్యారు. ప్రియమణి అతని డాన్స్ ను చూసి పొగిడింది. పూర్ణ మాత్రం ఎప్పటిలాగానే తన ముద్దులను గాల్లో ఎగిరేస్తూ పంచుకుంది. ఇక మధ్యమధ్యలో సుడిగాలి సుధీర్ పెర్ఫామెన్స్, రష్మీ, దీపికల మధ్య కామెడీ సీన్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారగా.. మొత్తానికి ఆది డాన్స్ బాగానే చేశాడు కదా అని ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment