Dhaba Style Fish Curry : చేపలను మనం రకరకాలుగా వండుకుని తినవచ్చు. కొందరు వేపుడు అంటే ఇష్టపడతారు. కొందరు పులుసు పెట్టుకుని తింటారు. కొందరు గ్రిల్ చేసుకుని తింటారు. అయితే బయట ధాబాలలో చేసే చేపల పులుసు ఎంతో రుచికరంగా అనిపిస్తుంది. దాన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ధాబా స్టైల్ చేపల పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
చేపలు – 500 గ్రాములు, మారినేషన్ కోసం – శనగపిండి – ఒక టేబుల్ స్పూన్, కాశ్మీరీ ఎండుమిరపకాయల పొడి – ఒక టీస్పూన్, పసుపు – ఒక టీస్పూన్, ధనియాల పొడి – అర టీస్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, ఉప్పు – ఒక టీస్పూన్, నిమ్మరసం – రెండు టీస్పూన్లు, నూనె – రెండు టేబుల్ స్పూన్లు, నీళ్లు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు – 100 గ్రాములు, అల్లం (తరిగింది) – చిన్న ముక్క, తరిగిన టమాటాలు – 200 గ్రాములు, కారం – ఒకటీస్పూన్, ఆవాలు – అరటీస్పూన్, పచ్చి మిరపకాయలు (తరిగినవి) – 2
ధాబా స్టైల్ చేపల పులుసు తయారు చేసే విధానం..
పైన తెలిపిన అన్ని పదార్థాలను కలిపి మసాలా మిశ్రమం తయారు చేయాలి. అందులో చేప ముక్కలను వేసి బాగా కలపాలి. ముక్కలకు మసాలా బాగా పట్టేలా కలపాలి. అనంతరం చేప ముక్కలను మారినేషన్ చేయాలి. అందుకు గాను మసాలా కలిపిన ముక్కలను 30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. తరువాత ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం, వెల్లుల్లి వేసి మిక్సీలో బ్లెండ్ చేయాలి. దాన్ని స్మూత్ పేస్ట్‌లా తయారు చేసుకోవాలి.
ఒక పాన్ తీసుకుని నూనె వేసి వేడి చేయాలి. ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఆ నూనెలో వేసి బాగా ఫ్రై చేయాలి. తరువాత వాటిని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు వేయాలి. తరువాత పచ్చి మిరపకాయలను వేయాలి. అందులో ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయలు, టమాటా పేస్ట్‌ను వేయాలి. బాగా కలపాలి. 20 నిమిషాల పాటు మీడియం హీట్‌పై ఫ్రై చేయాలి. తరువాత మసాలా పొడులు, ఉప్పు కలపాలి. మళ్లీ ఫ్రై చేయాలి. 5-6 నిమిషాల పాటు మీడియం నుంచి తక్కువ హీట్‌పై ఫ్రై చేయాలి. అనంతరం 400 ఎంఎల్ నీరు కలపాలి. తరువాత అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టిన చేప ముక్కలను వేయాలి. మూత పెట్టి ఉడికించాలి. 10 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించాలి. తరువాత మూత తీసి దానిపై కసూరి మేథీ పొడి వేయాలి. అనంతరం కూరను కలిపి మరో 2-3 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టి ఉడికించాలి. దీంతో వేడి వేడి ధాబా స్టైల్ చేపల పులుసు రెడీ అవుతుంది. దీన్ని అన్నం లేదా రోటీల్లో తినవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…