Dhaba Style Fish Curry : నోరూరించే ధాబా స్టైల్‌ చేపల పులుసు.. ఇలా తయారు చేసుకోండి..!

January 29, 2022 1:05 PM

Dhaba Style Fish Curry : చేపలను మనం రకరకాలుగా వండుకుని తినవచ్చు. కొందరు వేపుడు అంటే ఇష్టపడతారు. కొందరు పులుసు పెట్టుకుని తింటారు. కొందరు గ్రిల్‌ చేసుకుని తింటారు. అయితే బయట ధాబాలలో చేసే చేపల పులుసు ఎంతో రుచికరంగా అనిపిస్తుంది. దాన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

delicious Dhaba Style Fish Curry know the recipe

ధాబా స్టైల్‌ చేపల పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..

చేపలు – 500 గ్రాములు, మారినేషన్‌ కోసం – శనగపిండి – ఒక టేబుల్‌ స్పూన్‌, కాశ్మీరీ ఎండుమిరపకాయల పొడి – ఒక టీస్పూన్‌, పసుపు – ఒక టీస్పూన్‌, ధనియాల పొడి – అర టీస్పూన్‌, జీలకర్ర – అర టీస్పూన్‌, ఉప్పు – ఒక టీస్పూన్‌, నిమ్మరసం – రెండు టీస్పూన్లు, నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు, నీళ్లు – ఒక టేబుల్‌ స్పూన్‌, తరిగిన ఉల్లిపాయలు – 100 గ్రాములు, అల్లం (తరిగింది) – చిన్న ముక్క, తరిగిన టమాటాలు – 200 గ్రాములు, కారం – ఒకటీస్పూన్‌, ఆవాలు – అరటీస్పూన్‌, పచ్చి మిరపకాయలు (తరిగినవి) – 2

ధాబా స్టైల్‌ చేపల పులుసు తయారు చేసే విధానం..

పైన తెలిపిన అన్ని పదార్థాలను కలిపి మసాలా మిశ్రమం తయారు చేయాలి. అందులో చేప ముక్కలను వేసి బాగా కలపాలి. ముక్కలకు మసాలా బాగా పట్టేలా కలపాలి. అనంతరం చేప ముక్కలను మారినేషన్‌ చేయాలి. అందుకు గాను మసాలా కలిపిన ముక్కలను 30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. తరువాత ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం, వెల్లుల్లి వేసి మిక్సీలో బ్లెండ్‌ చేయాలి. దాన్ని స్మూత్‌ పేస్ట్‌లా తయారు చేసుకోవాలి.

ఒక పాన్‌ తీసుకుని నూనె వేసి వేడి చేయాలి. ముందుగా మారినేట్‌ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఆ నూనెలో వేసి బాగా ఫ్రై చేయాలి. తరువాత వాటిని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు వేయాలి. తరువాత పచ్చి మిరపకాయలను వేయాలి. అందులో ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయలు, టమాటా పేస్ట్‌ను వేయాలి. బాగా కలపాలి. 20 నిమిషాల పాటు మీడియం హీట్‌పై ఫ్రై చేయాలి. తరువాత మసాలా పొడులు, ఉప్పు కలపాలి. మళ్లీ ఫ్రై చేయాలి. 5-6 నిమిషాల పాటు మీడియం నుంచి తక్కువ హీట్‌పై ఫ్రై చేయాలి. అనంతరం 400 ఎంఎల్‌ నీరు కలపాలి. తరువాత అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టిన చేప ముక్కలను వేయాలి. మూత పెట్టి ఉడికించాలి. 10 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించాలి. తరువాత మూత తీసి దానిపై కసూరి మేథీ పొడి వేయాలి. అనంతరం కూరను కలిపి మరో 2-3 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టి ఉడికించాలి. దీంతో వేడి వేడి ధాబా స్టైల్‌ చేపల పులుసు రెడీ అవుతుంది. దీన్ని అన్నం లేదా రోటీల్లో తినవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now