Curry Leaves Chutney : కరివేపాకును మనం ప్రతిరోజూ వంటల్లో వాడుతూ ఉంటాం. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కంటి చూపును మెరుగుపరచడంలో, గాయాలను తగ్గించడంలో కరివేపాకు సహాయపడుతుంది. బరువును తగ్గించడంలో, షుగర్ వ్యాధిని నియంత్రించడంలో, జ్ఞాపకశక్తిని, కంటి చూపును మెరుగుపరచడంలో కరివేపాకు ఎంతగానో ఉపయోడపడుతుంది. కరివేపాకుతో మనం కారం పొడిలను కూడా తయారు చేస్తూ ఉంటాం. కరివేపాకుతో ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. కరివేపాకుతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కరివేపాకు పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టీ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మినప పప్పు – 3 టీ స్పూన్స్, ఎండు మిర్చి – 8, కరివేపాకు ఆకులు – ఒక కప్పు, బెల్లం తురుము – 2 టీ స్పూన్స్, చింతపండు – ఒకటిన్నర టీ స్పూన్, ఉప్పు – ఒక టీ స్పూన్, నీళ్లు – అర కప్పు.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒ కటేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్.
కరివేపాకు పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి కాగాక ధనియాలు, జీలకర్ర, మినప పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు ఆకులను వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక జార్ లో వీటితోపాటు బెల్లం తురుము, ఉప్పు, చింతపండును వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత నీళ్లను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి తాళింపు పదార్థాలు వేసి తాళింపు చేసుకోవాలి. ఇలా తాళింపు చేసుకున్న తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు ఈ పచ్చడిని చిన్న మంటపై వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కరివేపాకు పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల నెల రోజుల వరకు తాజాగా ఉంటుంది. అన్నం, నెయ్యితో ఈ పచ్చడిని తింటే చాలా రుచిగా ఉంటుంది. దీన్ని అన్నంలో మొదటి ముద్దగా తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…