Chiranjeevi : ఒకే రోజు రిలీజ్ అయిన రెండు చిరంజీవి సినిమాలు.. ఏది హిట్ అంటే..?

October 4, 2022 9:33 AM

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇప్ప‌టికే త‌న సినిమా కెరీర్‌లో ఎన్నో వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల్లో న‌టించారు. ఆయ‌న మ‌ళ్లీ గాఢ్ ఫాద‌ర్ ద్వారా మ‌న‌కు ముందుకు రానున్నారు. అయితే చిరంజీవి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వ‌చ్చారు. క‌ష్టంతో ఎదిగారు. మెగాస్టార్ అయ్యారు. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. 50 ఏళ్ల ఆయ‌న సినిమా కెరీర్‌లో ఎన్నో హిట్స్ ఉన్నాయి. ఇక రాజ‌కీయాల్లోనూ చిరంజీవి గ‌తంలో యాక్టివ్‌గా ఉన్నారు. కానీ అనుకున్న ల‌క్ష్యం సాధించ‌లేక‌పోయారు. దీంతో రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పి 10 ఏళ్ల గ్యాప్ తీసుకుని మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌చ్చారు.

సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌రువాత చిరంజీవి చేసిన సినిమాల్లో కేవ‌లం ఖైదీ నంబ‌ర్ 150 మాత్ర‌మే ఆక‌ట్టుకుంది. సైరా, ఆచార్య చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే చిరంజీవి గాడ్ ఫాద‌ర్ తో ఎలాగైనా హిట్ కొట్టాల‌ని చూస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరోగా కొనసాగుతున్న రోజుల్లో అనగా 1982 లో రెండు సార్లు ఆయన నటించిన రెండు సినిమాలు కూడా ఒకే రోజున విడుదల అయ్యాయి. 1982 జూలై 30వ తేదీన చిరంజీవి హీరోగా నటించిన సీతాదేవి, రాధా మై డార్లింగ్ సినిమాలు విడుదల అయ్యాయి. ఆ తర్వాత అక్టోబర్ 1వ తేదీన పట్నం వచ్చిన పతివ్రతలు, టింగు రంగడు సినిమాలు కూడా విడుదల అయ్యాయి.

Chiranjeevi two movies released on same day know which is superhit
Chiranjeevi

కాగా పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాకు మౌళి దర్శకత్వం వహించారు. చిరంజీవి, మోహన్ బాబు హీరోలుగా నటించారు. వారి సరసన రాధిక‌, గీత‌ నటించారు. అలాగే చిరంజీవి సోలో హీరోగా నటించిన టింగు రంగడు సినిమాలో కూడా హీరోయిన్ గా గీత చిరంజీవికి జోడీగా నటించింది. అయితే పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాలో చిరంజీవికి వదినగా నటించిన గీత ఆ సినిమాలో చిరంజీవితో కలిసి రొమాన్స్ చేసిందన్నమాట.

ఇక ఈ సినిమాకు టీఎల్‌వీ ప్రసాద్ దర్శకుడు కాగా.. ఒకే రోజు విడుద‌లైన‌ ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా వినోదాన్ని పంచింది. ఇక టింగు రంగడు సినిమా మాస్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అయితే అప్ప‌ట్లో ఇలా ఒకే రోజు రెండు సినిమాల‌ను రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడ‌ది సాధ్య‌మ‌య్యే ప‌ని కాద‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now