Chiranjeevi : చిరంజీవితో ఒక రేంజ్‌లో కామెడీ మూవీ.. కథను సిద్ధం చేస్తున్న మారుతి..?

November 6, 2021 9:54 AM

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో స‌త్తా చాటుతున్నారు. వ‌రుస‌ పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసిన చిరు ప్ర‌స్తుతం గాడ్ ఫాద‌ర్, భోళా శంక‌ర్ చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేయ‌నున్నారు. అయితే మారుతి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్న‌ట్టు కొన్నాళ్లుగా ప్ర‌చారం న‌డుస్తోంది. ఇటీవలే మారుతి మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఒక లైన్ చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి.

Chiranjeevi to act in conedy entertainer with director maruthi

మారుతి కూడా దీనిపై స్పందించారు. త‌న క‌థ‌కు ఇంప్రెస్ అయిన చిరంజీవి పూర్తి స్క్రిప్ట్ సిద్దం చేయాల‌ని సూచించిన‌ట్టు మారుతి వెల్ల‌డించారు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో చిరంజీవిలోని కామెడీ టైమింగ్‌ను ప‌ర్‌ఫెక్ట్‌గా వాడుకోబోతున్నారట మారుతి . బాస్ ఓకే అనడంతో మెగాస్టార్ గతంలో నటించిన ‘శంకర్ దాదా’ తరహాలో ఓ కథను మారుతి సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ ప్రధానంగా ఉండేలా కథను రాస్తున్నాడట మారుతి. చిరంజీవి కమిట్ అయిన సినిమాలు పూర్తయిన తర్వాత మారుతి సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ప్ర‌స్తుతం మారుతి గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ సినిమా చేస్తున్నారు. షూటింగ్ పరంగా ఈ సినిమా చివరిదశకు చేరుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మారుతి ఓ భారీ సినిమా చేస్తున్నారని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now