Chiranjeevi : హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్‌బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. సినీ నటుడు చిరంజీవి, మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు కూడా ఈ కార్యక్రమానికి వెళ్లారు. కార్యక్రమంలో గరికపాటి ప్రవచనాలు చెబుతున్న సమయంలో చిరంజీవితో ఫొటోలు దిగేందుకు అక్కడున్న వారు ఆసక్తి చూపారు. చిరంజీవి కూడా ఎవరినీ నొప్పించకుండా అందరికి ఫొటోలు తీసుకునేందుకు అవకాశం ఇచ్చాడు.
అయితే అప్పటికే ప్రవచనం ఆరంభించిన గరికపాటికి ఈ పరిణామం ఇబ్బందిగా అనిపించింది. దీంతో.. అసహనానికి గురైన గరికపాటి అక్కడ మొత్తం ఫొటోల సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతాను. లేకపోతే నేను వెళ్లిపోతాను. నాకేం మొహమాటం లేదు. చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి ఈ పక్కకు రండి. నేను మాట్లాడతాను అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొంతసేపటికి చిరంజీవి వెళ్లి గరికపాటి పక్కనే కూర్చుని ప్రవచనం విన్నారు. అంతటితో ఆ చిన్నపాటి వివాదాస్పద పరిణామానికి శుభం కార్డు పడింది. అయితే.. ఆ వీడియో అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీంతో.. మెగా అభిమానులు చిరంజీవిని గరికపాటి అలా అనడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ సోషల్ మీడియాలో గరికపాటి నరసింహారావుపై విరుచుకుపడుతున్నారు. అయితే దీనిపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన.. గరికపాటి వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆయన పెద్దాయన.. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు అని తేల్చేసారు. ఇదిలావుండగా మెగాస్టార్ చిరంజీవిపై అసహనం వ్యక్తం చేసిన గరికపాటిపై మెగా బ్రదర్ నాగబాబు సెటైర్ కూడా వేశాడు. ఏ పాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే అంటూ నాగబాబు ట్వీట్ చేసాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…