Chiranjeevi : గరికపాటి ఇష్యూపై స్పందించిన చిరు.. ఏమ‌న్నారంటే..?

October 14, 2022 5:35 PM

Chiranjeevi : హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్‌బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. సినీ నటుడు చిరంజీవి, మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు కూడా ఈ కార్యక్రమానికి వెళ్లారు. కార్యక్రమంలో గరికపాటి ప్రవచనాలు చెబుతున్న సమయంలో చిరంజీవితో ఫొటోలు దిగేందుకు అక్కడున్న వారు ఆసక్తి చూపారు. చిరంజీవి కూడా ఎవరినీ నొప్పించకుండా అందరికి ఫొటోలు తీసుకునేందుకు అవకాశం ఇచ్చాడు.

అయితే అప్పటికే ప్రవచనం ఆరంభించిన గరికపాటికి ఈ పరిణామం ఇబ్బందిగా అనిపించింది. దీంతో.. అసహనానికి గురైన గరికపాటి అక్కడ మొత్తం ఫొటోల సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతాను. లేకపోతే నేను వెళ్లిపోతాను. నాకేం మొహమాటం లేదు. చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి ఈ పక్కకు రండి. నేను మాట్లాడతాను అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొంతసేపటికి చిరంజీవి వెళ్లి గరికపాటి పక్కనే కూర్చుని ప్రవచనం విన్నారు. అంతటితో ఆ చిన్నపాటి వివాదాస్పద పరిణామానికి శుభం కార్డు పడింది. అయితే.. ఆ వీడియో అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Chiranjeevi responded on Garikapati issue what he said
Chiranjeevi

దీంతో.. మెగా అభిమానులు చిరంజీవిని గరికపాటి అలా అనడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ సోషల్ మీడియాలో గరికపాటి నరసింహారావుపై విరుచుకుపడుతున్నారు. అయితే దీనిపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన.. గరికపాటి వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆయన పెద్దాయన.. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు అని తేల్చేసారు. ఇదిలావుండగా మెగాస్టార్ చిరంజీవిపై అసహనం వ్యక్తం చేసిన గరికపాటిపై మెగా బ్రదర్ నాగబాబు సెటైర్ కూడా వేశాడు. ఏ పాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే అంటూ నాగబాబు ట్వీట్ చేసాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now