Samantha : అక్కినేని ఫ్యామిలీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత సమంత చాలా డిప్రెషన్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆ డిప్రెషన్ నుండి బయటపడేందుకు సమంత సినిమాలు, విహారయాత్రలు, సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఫుల్ బిజీగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం గోవా వెళ్లింది. తన ఫ్రెండ్స్‌తో చేస్తున్న రచ్చ చూసి అందరూ షాక్ అవుతున్నారు.
అయితే సమంత తొలిసారి పుష్ప సినిమా కోసం ‘ఊ అంటావా ఊహూ అంటావా మావా’ సాంగ్ లో ఐటమ్ భామగా మెరిసింది. ఇందులో సమంత బోల్డ్ మూమెంట్స్, స్కిన్ షో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. పుష్ప చిత్రానికి ఈ సాంగ్ హైలెట్ అయ్యింది. అయితే ఈ సాంగ్ లో సమంత నటించడం వెనుక చిరంజీవి హస్తం ఉందట.
అదెలా అంటే.. ఆ మధ్య చిరంజీవి, రామ్ చరణ్ పాల్గొన్న ఓ ప్రైవేట్ ఈవెంట్ కి సమంత కూడా వెళ్లిందట. అక్కడ చిరంజీవి , సమంత, రామ్ చరణ్ మధ్య సంభాషణ జరిగిందట. చైతూతో విడాకుల కారణంగా సమంత డిప్రెషన్ ఫీల్ అవుతుందని తెలుసుకున్న చిరు షూటింగ్స్ లో బిజీ కావడం ద్వారా ఈ డిప్రెషన్ ని అధిగమించవచ్చని సలహా ఇచ్చారట.
అంతే కాదు పుష్ప ఐటమ్ సాంగ్ గురించి సమంతతోపాటు సుకుమార్‌తో చర్చించారట. ఇరువురూ ఓకే అనడంతో సమంత అలా మెరిసిందని టాక్స్ వినిపిస్తున్నాయి. ఊ అంటావా ఊహూ అంటావా సాంగ్ ని ప్రత్యేకమైన సెట్ లో దాదాపు 5 రోజులు షూటింగ్ చేశారు. ఇక ఈ సాంగ్ కి కోటిన్నర రూపాయల వరకు సమంత తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…