Samantha : పుష్పలో సాంగ్ చేయ‌మ‌ని స‌మంత‌కి స‌ల‌హా ఇచ్చింది చిరంజీవా..?

December 31, 2021 9:41 AM

Samantha : అక్కినేని ఫ్యామిలీతో తెగ‌తెంపులు చేసుకున్న త‌ర్వాత స‌మంత చాలా డిప్రెష‌న్‌లోకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ డిప్రెష‌న్ నుండి బ‌య‌ట‌ప‌డేందుకు స‌మంత సినిమాలు, విహారయాత్ర‌లు, సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తూ ఫుల్ బిజీగా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ కోసం గోవా వెళ్లింది. త‌న ఫ్రెండ్స్‌తో చేస్తున్న ర‌చ్చ చూసి అంద‌రూ షాక్ అవుతున్నారు.

chiranjeevi reportedly given advice to Samantha to do item song

అయితే సమంత తొలిసారి పుష్ప సినిమా కోసం ‘ఊ అంటావా ఊహూ అంటావా మావా’ సాంగ్ లో ఐటమ్‌ భామ‌గా మెరిసింది. ఇందులో సమంత బోల్డ్ మూమెంట్స్, స్కిన్ షో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. పుష్ప చిత్రానికి ఈ సాంగ్ హైలెట్ అయ్యింది. అయితే ఈ సాంగ్ లో సమంత నటించడం వెనుక చిరంజీవి హస్తం ఉందట.

అదెలా అంటే.. ఆ మధ్య చిరంజీవి, రామ్ చరణ్ పాల్గొన్న ఓ ప్రైవేట్ ఈవెంట్ కి సమంత కూడా వెళ్లిందట. అక్కడ చిరంజీవి , సమంత, రామ్ చరణ్ మధ్య సంభాషణ జరిగిందట. చైతూతో విడాకుల కారణంగా సమంత డిప్రెషన్ ఫీల్ అవుతుంద‌ని తెలుసుకున్న చిరు షూటింగ్స్ లో బిజీ కావడం ద్వారా ఈ డిప్రెషన్ ని అధిగమించవచ్చని సలహా ఇచ్చారట.

అంతే కాదు పుష్ప ఐటమ్‌ సాంగ్ గురించి స‌మంత‌తోపాటు సుకుమార్‌తో చ‌ర్చించార‌ట‌. ఇరువురూ ఓకే అన‌డంతో స‌మంత అలా మెరిసింద‌ని టాక్స్ వినిపిస్తున్నాయి. ఊ అంటావా ఊహూ అంటావా సాంగ్ ని ప్రత్యేకమైన సెట్ లో దాదాపు 5 రోజులు షూటింగ్ చేశారు. ఇక ఈ సాంగ్ కి కోటిన్నర రూపాయల వరకు సమంత తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now