Chiranjeevi On Acharya : మొద‌టిసారిగా ఆచార్య ఫ్లాప్‌పై స్పందించిన చిరంజీవి.. ఏమ‌న్నారంటే..?

September 1, 2022 4:21 PM

Chiranjeevi On Acharya : ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదనేది అపోహ మాత్రమేనని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. బుధవారం ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు చిరంజీవి చీఫ్‌ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఫిల్మ్ ఇండస్ట్రీ నన్ను ఎంతో పెద్ద వాణ్ణి చేసిందని తెలిపారు. సినీ రంగాన్ని వదిలి కొన్నాళ్లు వేరే రంగానికి వెళ్లాను. తిరిగొచ్చాకే సినీ పరిశ్రమ విలువ మరింత తెలిసిందన్నారు. అలాగే సినిమా డైరెక్టర్లపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద స్టార్లు.. వారి కాల్షీట్లు దొరికితే హడావుడిగా సినిమాలు చేయోద్దని డైరెక్టర్లకు సూచించారు. డైరెక్టర్లు సినిమా విషయంలో బాగా కసరత్తు చేయాలన్నారు.

కంటెంట్ ఉంటే జనం తప్పకుండా సినిమా చూసేందుకు థియేటర్‌కు వస్తారన్నారు. అందుకు లేటెస్ట్ గా వచ్చిన బింబిసార‌, సీతారామం, కార్తికేయ 2 సినిమాలే ఉదాహరణ. కంటెంట్ లేక‌పోతే సినిమా రెండో రోజే పోతుంది. అందులో నేను కూడా ఓ బాధితుడినే. ద‌ర్శ‌కులే మూవీకి కెప్టెన్ ఆఫ్ ది షిప్‌. సినిమాలో ఎమోష‌న్ అనేది చాలా ముఖ్యం. లేదా ఊపిరి స‌ల‌ప‌ని ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉండాలి. ఉదాహ‌ర‌ణ‌కు అనుదీప్ ఇచ్చిన జాతిర‌త్నాలు. ఆ విధంగా ద‌ర్శ‌కులు క‌థ‌ల‌పై ఫోక‌స్ పెట్టాలి. ఆర్టిస్టుల డేట్స్ వ‌చ్చేస్తున్నాయ‌ని హాడావుడి ప‌డిపోయి.. ఏదో ఒక‌టిలే ముందు బండి ఎక్కించేద్దామ‌నే ఆలోచ‌న వ‌ద్దు.

Chiranjeevi On Acharya what he has said about movie for the first time
Chiranjeevi On Acharya

ఎందుకంటే ద‌ర్శ‌కుల‌పై ఎంతో మంది టెక్నీషియ‌న్స్.. బ‌య్య‌ర్స్‌.. ఇత‌రులు ఆధార‌ప‌డి ఉంటారు. జ‌యాప‌జ‌యాలు మ‌న చేతిలో లేక‌పోయినా, హిట్ చేయాల‌నే ఆలోచ‌న‌తోనే ద‌ర్శ‌కులు కంటెంట్‌ను సిద్ధం చేసుకోవాలని సూచించారు చిరంజీవి. ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీని వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయ‌ణ పుట్టం శెట్టి డైరెక్ట్ చేశారు. జాతిర‌త్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ క‌థ‌, స్క్రీన్ ప్లే అందించారు. శ్రీజ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అనే బ్యాన‌ర్‌పై ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీని నిర్మిస్తున్నారు. ఏడిద శ్రీరామ్ చిత్ర సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 2న సినిమా రిలీజ్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment