Chiranjeevi : బాల‌కృష్ణ టాక్ షోలో పాల్గొనేందుకు చిరంజీవి నో చెప్పారా..?

October 29, 2021 12:54 PM

Chiranjeevi : నటసింహం నందమూరి బాలకృష్ణ ”అన్ స్టాపబుల్ విత్ NBK” టాక్ షో తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దీపావ‌ళి కానుక‌గా న‌వంబర్ 4వ తేదీ నుండి ఇది మొద‌లు కానుంది. ఇప్ప‌టికే ఈ షోకి సంబంధించి జోరుగా ప్ర‌చారాలు కొనసాగుతున్నాయి. ఇటీవ‌ల టీజ‌ర్ విడుద‌ల కాగా ఇది అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా చేసింది. ఈ షోని ఎలా హ్యండిల్ చేస్తారో చూడాలని అభిమానులతోపాటు ఇండస్ట్రీ జనాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Chiranjeevi might said no to balarkrishna unstoppable with nbk show

‘అన్ స్టాపబుల్’ టాక్ షోకి గెస్టులుగా ఎవ‌రెవ‌రు వ‌స్తారనే దానిపై ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఫ‌స్ట్ ఎపిసోడ్‌కి మోహ‌న్ బాబు త‌ర్వాత నాగ బాబు ఆ త‌ర్వాత నాని అని అంటున్నారు. అయితే ఈ కార్య‌క్ర‌మానికి గెస్టుగా రావడానికి చిరంజీవి తిరస్కరించడంతో మంచు ఫ్యామిలీ సభ్యులు హాజరయ్యారని అంటున్నారు. చిరంజీవి నిర్ణయం వెనుక కారణమేంటో తెలియనప్పటికీ.. ఈ మధ్య ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులే కారణమని కామెంట్స్ వస్తున్నాయి.

ఇటీవల జ‌రిగిన‌ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో చిరంజీవి – బాలకృష్ణ వేర్వేరు ప్యానల్స్ కు మద్దతు ప్రకటించగా.. బాలయ్య ప్రత్యక్షంగా మద్దతు పలికి మంచు విష్ణు గెలుపులో భాగం అయ్యారు. ఇక చిరు పరోక్షంగా ప్ర‌కాశ్ రాజ్‌కి స‌పోర్ట్ అందించారు. ప్ర‌స్తుతం చిరంజీవి అన్‌స్టాప‌బుల్ టాక్ షోని తిర‌స్క‌రించార‌నే వార్త ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now