మరోసారి మంచి మనసును చాటుకున్న చిరు.. అభిమాని చివరి కోరిక తీర్చిన మెగాస్టార్..

August 19, 2022 2:24 PM

మెగాస్టార్ చిరంజీవి రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోనే. ఎన్నో సందర్భాల్లో చిరు ఎంతో మంది ఆర్టిస్టులకు, సామాన్యులకు సైతం సాయం చేసిన విషయం మనకు తెలిసిందే. ఎన్నో స్వచ్ఛంద సంస్థల ద్వారా నిర్విరామంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తాజాగా చిరు తన అభిమాని చివరి కోరికను తీర్చి అతనిలో ఆత్మ స్తైర్యం నింపారు. తన అభిమాని చివరి కోరిక తీర్చడం కోసం అన్ని పనులు మానుకున్నారు.

తనను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అభిమాని గుండెల్లో ధైర్యం నింపారు చిరంజీవి. గుండెలకు హత్తుకుని ఓదార్చారు. చిరంజీవి సొంతూరు మొగల్తూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి మెగాస్టార్‌ కు వీరాభిమాని. రెండు కిడ్నీలు పాడైన అత‌ను చివరిసారిగా చిరంజీవిని చూడాలని ఉందని మనసులోని కోరిక బయటపెట్టాడు. ఈ విషయం చిరంజీవి దగ్గరకు చేరింది. ఆయన వెంటనే స్పందించారు.

chiranjeevi met his fan in serious health condition

వెంటనే తన అభిమాని కుటుంబాన్ని ఇంటికి ఆహ్వానించారు. మృత్యువుతో పోరాడుతున్న నాగరాజును చూసి చలించిపోయిన చిరు ఆయన్ను ఆప్యాయంగా హత్తుకున్నాడు. కాసేపు అభిమానితో మాట్లాడి అత‌నికి మానసిక స్థైర్యాన్ని అందించారు. అంతేకాక ఆర్థిక సాయం కూడా అందించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్ర‌మంలోనే చిరు మంచి మనసును ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. రీసెంట్ గా కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో ఇండస్ట్రీ తరపున నిలిచి కరోనా వెల్ఫేర్ ఫండ్ ను స్థాపించి అనేకమంది సినీ కార్మికులకు సహాయం అందించారు చిరంజీవి.

ప్రస్తుతం చిరంజీవి గాడ్‌ఫాద‌ర్ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. దీనితోపాటు బాబీ డైరెక్షన్ లో వాల్తేరు వీర‌య్య సినిమా కూడా చేస్తున్నారు. ఇవే కాకుండా మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో భోళా శంక‌ర్ సినిమాను కూడా చేస్తున్నారు చిరు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now