Chiranjeevi : ఆచార్య మూవీలో తప్పు చేసిన మెగాస్టార్.. తీవ్రంగా విమర్శిస్తూ ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు..!

June 3, 2022 3:29 PM

Chiranjeevi : మెగాస్టార్‌ చిరంజీవి చాలా రోజుల తరువాత చేసిన చిత్రం.. ఆచార్య. ఇందులో రామ్‌ చరణ్‌ ఇంకో కీలకపాత్రలో నటించారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరాజయం పాలైంది. ఏకంగా రూ.84 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. దీంతో కొరటాల, మెగాస్టార్‌, చరణ్‌ల కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా ఈ మూవీ నిలిచింది. ఇలాంటి సినిమాను ఎలా చేశారని కొరటాలను, మెగాస్టార్‌ను, చరణ్‌ను ప్రేక్షకులు చాలా విమర్శించారు. ఇక ఈ మూవీ రీసెంట్‌గా ఓటీటీలోనూ రిలీజ్‌ అయింది.

అయితే ఆచార్య మూవీకి ఓటీటీలోనూ పెద్దగా స్పందన లభించడం లేదు. దీనికి సరైన వ్యూస్‌ రావడం లేదు. దీంతో ఓటీటీలోనూ ఈ మూవీ నిరాశపరిచింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా గురించి మరిచిపోయిన మెగాస్టార్‌, చరణ్, కొరటాల తమ తదుపరి ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. మెగాస్టార్‌ గాడ్‌ ఫాదర్‌, బోళా శంకర్‌ షూటింగ్‌లతో బిజీగా ఉండగా.. చరణ్‌.. శంకర్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇక కొరటాల ఎన్‌టీఆర్‌తో కలిసి సినిమా చేస్తున్నారు. అయితే ఆచార్య మూవీని వారు మరిచిపోయారు కానీ కొందరు ప్రేక్షకులు మాత్రం ఇంకా మరిచిపోలేదు. అందులో ఉన్న తప్పులు వెదికిమరీ ట్రోల్‌ చేస్తున్నారు. తాజాగా అందులో చిరంజీవి చేసిన ఓ తప్పును కొందరు ప్రేక్షకులు కనిపెట్టారు. దీంతో ఆయనను వారు ట్రోల్‌ చేస్తున్నారు.

Chiranjeevi made a mistake in Acharya movie netizen troll him
Chiranjeevi

ఆచార్య సినిమాలో రథం లాగే సీన్‌ ఒకటి ఉంటుంది. అందులో చిరంజీవి రథం లాగుతారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. ఆధ్యాత్మిక సంబంధ కార్యక్రమాల్లో ఎవరూ పాదరక్షలను ధరించరు. కానీ చిరంజీవి అలా కాకుండా షూస్‌తోనే రథాన్ని ముందుకు తోశారు. దీంతో ఈ సీన్‌లో ఉన్న తప్పును వెదికిన కొందరు నెటిజన్లు చిరంజీవిని ట్రోల్‌ చేస్తున్నారు. ఆలయాలపై సినిమా తీశామన్నారు.. అందులో చేసిన తప్పు గురించి ఆమాత్రం తెలియదా.. చెప్పులు వేసుకోకుండా దైవకార్యం చేయాలన్న సంగతి మరిచిపోయారా.. అంటూ చిరంజీవిని ట్రోల్‌ చేస్తూ విమర్శిస్తున్నారు. ఇక దీనిపై చిత్ర యూనిట్‌ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now