Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే.. మినిమం గ్యారంటీ ఉంటుంది. ఆ రేంజ్‌లో ఆయన సినిమాలు ఉంటాయి. అయితే రాజకీయాల్లో చాలా కాలం కొనసాగి తిరిగి సినిమాల్లోకి వచ్చాక ఆయన నటించిన మూవీ ఖైదీ నంబర్ 150 బంపర్ హిట్ అయింది. కానీ ఆ తరువాత తీసిన సైరా నరసింహా రెడ్డికి మిశ్రమ స్పందన లభించింది. ఇక ఇటీవల వచ్చిన ఆచార్య మూవీ అయితే ఏకంగా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ ప్రస్తుతం అమెరికా టూర్‌లో ఉన్నారు. ఇక ఆయన చేస్తున్న చిత్రాల షూటింగ్ కూడా నిలిచిపోయింది. అయితే చిరంజీవి అంత సుదీర్ఘమైన అమెరికా టూర్‌లో ఎందుకు ఉన్నారా..? అంటే.. అందుకు బలమైన కారణమే వినిపిస్తోంది.
ఆచార్య సినిమాను తీసేందుకు 3 ఏళ్లకు పైగానే పట్టింది. చిరంజీవి సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. చాలా ఎక్కువ సమయం పడుతుంది కనుక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందేమోనని ఆశించారు. కానీ ఫ్యాన్స్ ఆశలు అడియాశలు అయ్యాయి. ఈ మూవీ ఎప్పుడో విడుదల కావల్సి ఉన్నా.. అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అలాగే సినిమాలో మెయిన్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ను పూర్తిగా లేపేశారు. దీనికి తోడు నక్సలిజం బ్యాక్‌గ్రౌండ్ మూవీ.. అందులో చిరంజీవిని యవ్వనంగా చూపించేందుకు వాడిన గ్రాఫిక్స్.. ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు.. ఆచార్య ఫ్లాప్‌కు అనేక కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు.
అయితే ఆచార్య సినిమా రిలీజ్ అయ్యాక నెల రోజుల్లోపే ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఇక ఈ మూవీ వల్ల డిస్ట్రిబ్యూటర్లే అధికంగా నష్టపోయారు. సినిమాకు ఏకంగా రూ.84 కోట్ల నష్టం వచ్చింది. దీంతో నష్టాలను భరించాలని వారు మొర పెట్టుకోగా.. రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శివ హామీ ఇచ్చారు. అయితే ఇదంతా అయిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి ? చిరంజీవి మళ్లీ ఇండియాకు ఎప్పుడు వస్తారు ? ఆయన తీస్తున్న సినిమాల సంగతేమిటి ? అని ఫ్యాన్స్ ఆరాలు తీస్తున్నారు. అయితే చిరు ఇప్పుడప్పుడే రాకూడదని.. ఇంకొన్ని రోజులు పోయాక వెళ్దామని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఆచార్య నేపథ్యంలో చిరంజీవి, రామ్ చరణ్‌లపై నెగెటివ్ టాక్ ఎక్కువగా వచ్చింది. ఈ మూవీపై చాలా మంది ట్రోల్స్, విమర్శలు చేశారు. అయితే ఆ విమర్శలు, ట్రోల్స్ ఇంకా తగ్గలేదు. మరోవైపు మూవీ ఓటీటీలోకి కూడా వచ్చేసింది. కనుక ఈ వేడి ఇంకా చల్లారాలంటే అందుకు ఇంకా కొంత సమయం పడుతుంది. కనుక ఇప్పుడప్పుడే చిరంజీవి ఇండియాకు తిరిగి రాకపోవచ్చని.. ఇంకొన్ని రోజుల సమయం పట్టవచ్చని.. వేడి అంతా చల్లారాక వస్తారని తెలుస్తోంది. అందుకనే ఆయన ఇలా సుదీర్ఘమైన అమెరికా టూర్ ను ప్లాన్ చేశారని సమాచారం. అయితే చిరంజీవి ఎప్పుడు వస్తారో తెలియక అటు ఆయన సినిమాలు తీస్తున్న దర్శక నిర్మాతలు కూడా సందిగ్ధంలో పడినట్లు సమాచారం. మరి దీనిపై క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…