Chiranjeevi : చిరంజీవి సుదీర్ఘ‌మైన అమెరికా టూర్‌.. కార‌ణం అదేనా..?

May 21, 2022 9:44 AM

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే.. మినిమం గ్యారంటీ ఉంటుంది. ఆ రేంజ్‌లో ఆయ‌న సినిమాలు ఉంటాయి. అయితే రాజ‌కీయాల్లో చాలా కాలం కొన‌సాగి తిరిగి సినిమాల్లోకి వ‌చ్చాక ఆయ‌న న‌టించిన మూవీ ఖైదీ నంబ‌ర్ 150 బంప‌ర్ హిట్ అయింది. కానీ ఆ త‌రువాత తీసిన సైరా న‌ర‌సింహా రెడ్డికి మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. ఇక ఇటీవ‌ల వ‌చ్చిన ఆచార్య మూవీ అయితే ఏకంగా డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఈ క్ర‌మంలోనే మెగాస్టార్ ప్ర‌స్తుతం అమెరికా టూర్‌లో ఉన్నారు. ఇక ఆయ‌న చేస్తున్న చిత్రాల షూటింగ్ కూడా నిలిచిపోయింది. అయితే చిరంజీవి అంత సుదీర్ఘ‌మైన అమెరికా టూర్‌లో ఎందుకు ఉన్నారా..? అంటే.. అందుకు బ‌ల‌మైన కార‌ణ‌మే వినిపిస్తోంది.

ఆచార్య సినిమాను తీసేందుకు 3 ఏళ్ల‌కు పైగానే ప‌ట్టింది. చిరంజీవి సినిమా కోసం ఆయ‌న ఫ్యాన్స్ క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూశారు. చాలా ఎక్కువ స‌మయం ప‌డుతుంది క‌నుక సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవుతుందేమోన‌ని ఆశించారు. కానీ ఫ్యాన్స్ ఆశ‌లు అడియాశ‌లు అయ్యాయి. ఈ మూవీ ఎప్పుడో విడుద‌ల కావ‌ల్సి ఉన్నా.. అనేక కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. అలాగే సినిమాలో మెయిన్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను పూర్తిగా లేపేశారు. దీనికి తోడు న‌క్స‌లిజం బ్యాక్‌గ్రౌండ్ మూవీ.. అందులో చిరంజీవిని య‌వ్వ‌నంగా చూపించేందుకు వాడిన గ్రాఫిక్స్‌.. ఇలా క‌ర్ణుడి చావుకు స‌వాల‌క్ష కార‌ణాలు అన్న‌ట్లు.. ఆచార్య ఫ్లాప్‌కు అనేక కార‌ణాలు ఉన్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

Chiranjeevi long America tour this may be the reason
Chiranjeevi

అయితే ఆచార్య సినిమా రిలీజ్ అయ్యాక నెల రోజుల్లోపే ఓటీటీలోకి కూడా వ‌చ్చేసింది. ఇక ఈ మూవీ వ‌ల్ల డిస్ట్రిబ్యూట‌ర్లే అధికంగా న‌ష్ట‌పోయారు. సినిమాకు ఏకంగా రూ.84 కోట్ల న‌ష్టం వ‌చ్చింది. దీంతో న‌ష్టాల‌ను భ‌రించాల‌ని వారు మొర పెట్టుకోగా.. రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ హామీ ఇచ్చారు. అయితే ఇదంతా అయిపోయింది. కానీ ఇప్పుడు ప‌రిస్థితి ఏమిటి ? చిరంజీవి మ‌ళ్లీ ఇండియాకు ఎప్పుడు వ‌స్తారు ? ఆయ‌న తీస్తున్న సినిమాల సంగ‌తేమిటి ? అని ఫ్యాన్స్ ఆరాలు తీస్తున్నారు. అయితే చిరు ఇప్పుడ‌ప్పుడే రాకూడ‌ద‌ని.. ఇంకొన్ని రోజులు పోయాక వెళ్దామ‌ని అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

ఆచార్య నేప‌థ్యంలో చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌ల‌పై నెగెటివ్ టాక్ ఎక్కువ‌గా వ‌చ్చింది. ఈ మూవీపై చాలా మంది ట్రోల్స్‌, విమ‌ర్శ‌లు చేశారు. అయితే ఆ విమ‌ర్శ‌లు, ట్రోల్స్ ఇంకా త‌గ్గలేదు. మ‌రోవైపు మూవీ ఓటీటీలోకి కూడా వ‌చ్చేసింది. క‌నుక ఈ వేడి ఇంకా చ‌ల్లారాలంటే అందుకు ఇంకా కొంత స‌మ‌యం ప‌డుతుంది. క‌నుక ఇప్పుడ‌ప్పుడే చిరంజీవి ఇండియాకు తిరిగి రాక‌పోవ‌చ్చ‌ని.. ఇంకొన్ని రోజుల స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చ‌ని.. వేడి అంతా చ‌ల్లారాక వ‌స్తార‌ని తెలుస్తోంది. అందుక‌నే ఆయన ఇలా సుదీర్ఘ‌మైన అమెరికా టూర్ ను ప్లాన్ చేశార‌ని స‌మాచారం. అయితే చిరంజీవి ఎప్పుడు వ‌స్తారో తెలియ‌క అటు ఆయ‌న సినిమాలు తీస్తున్న ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా సందిగ్ధంలో ప‌డిన‌ట్లు స‌మాచారం. మ‌రి దీనిపై క్లారిటీ ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now