Allu Studios : ఒక్క కార్య‌క్ర‌మంతో పుకార్ల‌కు చెక్‌.. అల్లు స్టూడియోస్‌ను ప్రారంభించిన చిరంజీవి..!

Allu Studios : హైద‌రాబాద్ మ‌రో ఫిలిం స్టూడియోకు వేదికైంది. ఇప్ప‌టికే అగ్ర హీరోల‌కు చెందిన ఫిలిం స్టూడియోలు ఉండ‌గా.. వాటి స‌ర‌స‌న అల్లు ఫ్యామిలీకి చెందిన అల్లు స్టూడియోస్ వ‌చ్చి చేరింది. అల్లు రామ‌లింగ‌య్య శ‌త జ‌యంతి సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని కోకాపేట‌లో అల్లు అర‌వింద్ నిర్మించిన అల్లు స్టూడియోస్‌ను శ‌నివారం మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. అల్లు రామ‌లింగ‌య్య లాంటి మ‌హా న‌టుడి పేరిట ఈ స్టూడియోస్‌ను నిర్మించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. అందుకు గాను అల్లు అర‌వింద్‌ను అభినందిస్తున్న‌ట్లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసినందుకు చిరంజీవికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. త‌న క‌ల నెర‌వేరింద‌ని అన్నారు. అలాగే అల్లు అర్జున్ మాట్లాడుతూ.. అల్లు రామ‌లింగ‌య్య లాంటి మ‌హా న‌టుడి పేరిట స్టూడియోస్ నిర్మించ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. ప్ర‌జ‌ల ఆశీస్సులు త‌మ‌కు ఎల్ల‌ప్పుడూ ఉంటాయ‌ని తెలిపారు. అల్లు ఫ్యామిలీలో పుట్టినందుకు గ‌ర్విస్తున్నాన‌ని తెలిపారు. ఇక అల్లు స్టూడియోస్ విష‌యానికి వ‌స్తే.. దీన్ని 10 ఎక‌రాల్లో నిర్మించారు. హైద‌రాబాద్‌లోని కోకాపేట‌లో ఈ స్టూడియో ఉంది.

Allu Studios

స‌రిగ్గా ఏడాది కింద ఈ స్టూడియోస్‌కు భూమి పూజ చేశారు. కాగా అక్టోబ‌ర్ 1వ తేదీన అల్లు రామ‌లింగ‌య్య శ‌త జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న జ్ఞాప‌కార్థం ఈ స్టూడియోను నిర్మించారు. దాదాపు పది ఎకరాల్లో ఈ స్టూడియో నిర్మాణం జరిగింది. అత్యాధునిక టెక్నాలజీతో, ప్రపంచ స్థాయి సదుపాయాలతో ఈ స్టూడియోని నిర్మించారు. సినిమాకి సంబంధించిన అన్ని పనుల‌ను ఇందులో చేసుకునేలా ప్లాన్‌ చేశారు. ఇక ఈ స్టూడియోని నిర్మాత అల్లు అరవింద్‌ సారథ్యంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తోపాటు ఆయన సోదరులు అల్లు బాబీ (వెంకటేష్‌), అల్లు శిరీష్‌లు కలిసి నిర్మించారు.

షూటింగ్‌లకు సంబంధించిన బిల్డింగ్‌ పనులు పూర్తయ్యాయి. దీంతో షూటింగ్‌ లు చేసుకునేందుకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవితోపాటు అల్లు అరవింద్‌, అల్లు అర్జున్, అల్లు బాబీ, అల్లు శిరీష్‌, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అయితే గ‌త కొంత కాలంగా మెగా, అల్లు ఫ్యామిలీల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు ఏర్ప‌డ్డాయ‌ని వ‌స్తున్న వార్త‌ల‌కు ఈ రోజు చెక్ పెట్టిన‌ట్లు అయింది. అంద‌రూ క‌ల‌సి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డంతో అవ‌న్నీ పుకార్లే అని స్ప‌ష్ట‌మైంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM