Meena : ఒకప్పుడు టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన కోలీవుడ్ బ్యూటీ మీనా. మీనా స్వతహాగా మళయాళ సినీ పరిశ్రమకు చెందినది అయినప్పటికీ టాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకుంది. ఈ క్రమంలో మీనా నటించిన పలు లవ్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలు సినీ ప్రేక్షకులను కట్టి పడేశాయి. అయితే రీసెంట్ గా భర్తను కోల్పోయిన మీనా కొన్నాళ్ళు ఇంటికే పరిమితమయ్యింది. ఈమధ్యే మళ్ళీ సినిమా షూటింగ్స్ కూడా స్టార్ట్ చేసింది.
తనకు ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ అయిన రంభ, సంఘవి, సంగీత లాంటి స్టార్స్ ఫ్యామిలీస్ తో కలిసి మీనా ఇంటికి వెళ్లారు. అక్కడ వారు సందడి చేసిన విషయం తెలిసిందే. అలాగే మీనా ఇటీవల తన 46వ పుట్టినరోజును ప్రాణస్నేహితుల మధ్య గ్రాండ్ గా జరుపుకుంది. మీనా ఇప్పుడిప్పుడే తన భర్త మరణం నుంచి బయటపడుతూ సాధారణ వ్యక్తిలా మారిపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా మీనా తన స్నేహితురాలితో కలిసి ఫారెన్ వెకేషన్ లో ఉంది.
మీనా తన స్నేహితురాలు స్టైలిస్ట్ రేణుక ప్రవీణ్ తో కలిసి విదేశాల్లో పలు ప్రదేశాల్లో తీసుకున్నటు వంటి ఒక రీల్ వీడియోని షేర్ చేసింది. ప్రస్తుతం ఈమె ఫారిన్ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇవి చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీనా తన భర్త మరణం నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. ఈమెను ఇలా సంతోషంగా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది, మీనా ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్‌కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…