Chiranjeevi God Father : చిరు మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గాడ్ ఫాదర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. జస్ట్ టైటిల్ వీడియోతో యూట్యూబ్ రికార్డులు బద్దలు కొట్టారు. గాడ్ ఫాదర్ ఎలా ఉంటారో మనకు చూపించేసి.. నెట్టింట హంగామాను క్రియేట్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మెగా ఫ్యాన్స్ అంచనాలను ఈ టీజర్ తో నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు మేకర్స్.
మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమాను విజయదశమికే రిలీజ్ చేస్తామంటూ గతంలో కన్ఫర్మ్ చేశారు మేకర్స్. దీంతో ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే మెగా ఫ్యాన్స్ వెయింటింగ్ షూరూ అయిపోయింది. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. గాడ్ ఫాదర్ మూవీ 2019 మలయాళ చిత్రం లూసిఫర్ కు అఫీషియల్ రీమేక్. అక్టోబర్ 5న దసరాకు ఈ మూవీని విడుదల చేయనున్నారు.
తాజాగా వచ్చిన క్రేజీ అప్డేట్ ఏంటంటే.. ఈ భారీ చిత్రాన్ని డిజిటల్ హక్కులను స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు భారీ ధరకు కొనుగోలు చేసిందట. అలాగే ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకాలపై రామ్ చరణ్, ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ మూవీకి మ్యూజిక్ అందించాడు. ఇటీవల విడుదలైన పాట కూడా అందరినీ ఆకట్టుకుంది. గాడ్ ఫాదర్ మూవీతో చిరు హిట్ కొడతారో లేదో చూడాలి.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…